KBC 16: కౌన్ బనేగా కరోడ్ పతిలో రూ. కోటి గెలిచేశాడు: ఎవరీ చందర్ ప్రకాశ్?

Kaun Banega Crorepati: చందర్ ప్రకాశ్ కౌన్ బనేగా కరోడ్ పతి 16వ సీజన్ లో కోటి రూపాయాల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు.

Update: 2024-09-26 08:28 GMT

Kaun Banega Crorepati

Kaun Banega Crorepati: చందర్ ప్రకాశ్ కౌన్ బనేగా కరోడ్ పతి 16వ సీజన్ లో కోటి రూపాయాల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఈ గేమ్ నుంచి క్విట్ అయిన తర్వాత రూ. 7 కోట్ల ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం కూడా సరైందే. ఈ సీజన్ లో కోటి రూపాయాలు గెలుచుకున్న మొదటి వ్యక్తి చందర్ ప్రకాశ్.

ఎవరీ చందర్ ప్రకాశ్?

చందర్ ప్రకాశ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన వయస్సు 22 ఏళ్లు. ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి, యూపీఎస్ సీ పరీక్షలకు ఆయన సిద్దమౌతున్నారు.

చందర్ కు ఆరోగ్య సమస్యలు

చందర్ ప్రకాశ్ కు ఆరోగ్య సమస్యలున్నాయి. పుట్టుకతోనే ఆయనకు ప్రేగులో పూడికతో ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఆయనకు ఇప్పటికే ఏడుసార్లు శస్త్రచికిత్సలు చేశారు. ఎనిమిదో శస్త్రచికిత్స చేయాలని కూడా వైద్యులు సూచించారు. అయినా కూడా చందర్ తన ఆరోగ్య సమస్యలను పక్కన పెట్టి ముందుకు సాగుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా తన ఆశయ సాధనలో ఆయన ఏనాడూ వెనక్కు తగ్గలేదు.

రూ. 7 కోట్ల ప్రశ్నకు కరెక్ట్ సమాధానం

కౌన్ బనేగా కరోడ్ పతి 16 వ సీజన్ లో చందర్ ప్రకాశ్ ఎపిసోడ్ బుధవారం ప్రసారమైంది. ఇందులోని అన్ని ప్రశ్నలకు ఆయన వరుసగా సమాధానాలు చెబుతూ కోటి రూపాయాల ప్రశ్నకు చేరుకున్నారు. ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ... శాంతి నివాసం అనే అరబిక్ పేరుతో ఆ నగరం ఓ పోర్టును కలిగి ఉందని అమితాబ్ బచ్చన్ ప్రశ్నించారు. అయితే దీనికి డబుల్ డిప్ లైఫ్ లైన్ ఉపయోగించుకొని ఆప్షన్ సీ టాంజానియాను సమాధానంగా ఎంచుకున్నారు.

ఈ సమాధానం కరెక్ట్ కావడంతో ఆయనకు కోటి రూపాయాలు వచ్చాయి. కోటి రూపాయాల ప్రైజ్ మనీ గెలుచుకోవడంతో బిగ్ బి ఆయనను తన సీట్లో నుంచి లేచి అభినందించారు. ఆ తర్వాత ఆయన రూ. 7 కోట్ల ప్రశ్నను ఎదుర్కొన్నారు. అయితే అప్పటికే ఆయనకు లైఫ్ లైన్లు అయిపోయాయి.దీంతో షో నుంచి క్విట్ అవుతానని చందర్ చెప్పారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని అమితాబ్ బచ్చన్ ఆయనను కోరారు. అయితే ప్రకాశ్ చెప్పిన సమాధానం కూడా కరెక్ట్.

కౌన్ బనేగా కరోడ్ పతిలో గెలుచుకున్న డబ్బుతో భవిష్యత్తులో చేసే శస్త్రచికిత్సకు ప్రకాశ్ ఉపయోగించుకోనున్నారు. తన కుటుంబాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఈ డబ్బు గట్టెక్కిస్తుందని ఆయన చెప్పారు. ఈ విజయాన్ని అందుకోవడం వెనుక తన కుటుంబం తనకు అండగా ఉందని ప్రకాశ్ తెలిపారు.

Tags:    

Similar News