Yogi Adityanath: వరదబాధితులకు సీఎం ఆదిత్యనాథ్ వరాలు
Yogi Adityanath: పంటలు దెబ్బతిన్న రైతులకు హెక్టారుకు రూ.18వేల పరిహారం
Yogi Adityanath: భారీ వర్షాలతో నిరాశ్రయులైన అందరికీ పక్కాఇళ్లను నిర్మించి ఇస్తామని యోగి ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ పరిసరాల్లోని అయోధ్య, భగవాన్‌పూర్, రప్తీ పరిసరాల్లోని 70 గ్రామాల్లో ఆయన స్వయంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదనష్టంపై అధికారులనుంచి నివేదికలపై సమీక్షించారు. వరద పీడిత ప్రాంతాల్లో బాధితులకోసం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.
వర్షాల్లో మృత్యువాత పడినవారి కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయంకింద నాలుగు లక్షలరూపాయల ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వరదబాధిత కుటుంబాలకు అండగా నిలవాలన్నది ప్రభుత్వ బాధ్యత అన్నారు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు హెక్టారుకు 18 వేలరైూపాయలు, పశు సంపద పోగొట్టుకున్న బాధిత కుటుంబాలకు తక్షణసాయం నాలుగువేలరూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారు.