అక్టోబర్ 15నుంచి అమల్లోకి అన్‌లాక్‌ 5.0 గైడ్‌‌లైన్స్

Update: 2020-10-03 07:44 GMT

దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను ప్రకటింటించింది. మరిన్ని మినహాయింపులతో కూడిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే 50శాతం సీట్ల సామర్థ్యానికే అనుమతిచ్చింది. ఇక, స్కూల్స్ రీఓపెన్ పై నిర్ణయాన్ని తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడిచి పెట్టింది.

దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ 4.0 గడువు ముగిసింది. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. కంటైన్మెంట్‌ జోన్లలో అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు/ మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిచ్చింది.

పాఠశాలలు ప్రారంభించే విషయంపై ఆయా రాష్ర్ట ప్రభుత్వాలకే నిర్ణయాన్ని వదిలేసింది కేంద్రం. ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగించవచ్చని కోచింగ్‌ సెంటర్లు, కాలేజీలు దశల వారీగా తెరిచే అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. విద్యార్థులను పాఠశాలలకు పంపించే విషయంలో తల్లిదండ్రుల అనుమతితోనే తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాల్లో వెల్లడించింది.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్లు, ఎంటర్ టైన్మెంట్ పార్కులు ఓపెన్ చేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. క్రీడాకారుల ట్రైనింగ్ కోసం స్విమ్మింగ్ పూల్స్ తెరిచే వెసులుబాటు కల్పించింది. సామాజిక/ విద్యా / క్రీడలు / వినోదం / సాంస్కృతిక / మత / రాజకీయ విధులు, ఇతర సమ్మేళనాలకు ఇప్పటికే 100 మంది వ్యక్తులకు అనుమతిస్తూ అన్ లాక్ 5.0 మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.. హోంశాఖ అనుమతి పొందినవి మినహా ఇతర అంతర్జాతీయ విమానయాన ప్రయాణాలకు అనుమతి లేదని కేంద్రం స్పష్టంచేసింది. అనుమతి లేకుండా కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ఎలాంటి లాక్‌డౌన్లు విధించకూడదని కేంద్ర మార్గదర్శకాల్లో వివరించారు. రాష్ట్రాల పరిధిలో గానీ, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై గానీ ఎలాంటి ఆంక్షలు విధించొద్దని, ప్రయాణానికి ప్రత్యేకంగా ఎలాంటి పాసులూ అవసరం లేదని కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News