పుదుచ్చేరి అసెంబ్లీ రద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో సీఎం నారాయణ స్వామి విశ్వాసపరీక్షలో నెగ్గకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రాకపోవడంతో 14వ అసెంబ్లీని సస్పెండ్ చేస్తూ లెప్ట్ నెంట్ గవర్నర్ సిఫారసు చేశారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ సిఫారసును కేంద్రం ఆమోదిస్తూ అసెంబ్లీ రద్దు అంశాన్ని రాష్ర్టపతికి పంపించింది. రాష్ర్టపతి ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీ రద్దు అవుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.