కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. 2023-24 రబీ పంటల మద్దతు ధర పెంపునకు ఆమోదం
*కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. 2023-24 రబీ పంటల మద్దతు ధర పెంపునకు ఆమోదం
Marketing Season 2023-24: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2023-24 రబీ పంటల మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది.గోధుమలకు మద్దతు ధర క్వింటాకు 2వేల 125 రూపాయలు, గోధుమలకు మద్దతు ధర క్వింటాకు 2వేల 125 రూపాయలు, బార్లీ మద్దతు ధర క్వింటాకు 1,735 రూపాయలు, ఆవాలు మద్దతు ధర క్వింటాకు 5వేల 450 రూపాయలు, సన్ ఫ్లవర్ మద్దతు ధర క్వింటాకు 5వేల 650 రూపాయలకు పెంచారు. కందులు క్వింటాల్‌కు 500రూపాయలు, ఆవాలు క్వింటాల్‌కు 400 రూపాయలు, కుసుమకు క్వింటాల్‌కు 209 రూపాయలు, గోధుమలు 110 రూపాయలు, శనగలు 105 రూపాయలు, బార్లీలకు 100 రూపాయలకు మద్దతు ధర పెంచినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.