Central Cabinet: కేంద్ర కేబినెట్ మూడు నిర్ణయాలకు ఆమోదం
Central Cabinet: బయో ఈ-3 విధానంతోపాటు విజ్ఞాన్ ధార పథకం.. 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కల్పనకు ఆమోదం
Central Cabinet: కేంద్ర కేబినెట్ మూడు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బయో ఈ-3 విధానంతోపాటు విజ్ఞాన్ ధార పథకం, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కల్పనకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్రం యూనిఫైడ్ పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. సుమారు 23 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారన్నారు. దీని కోసం 10వేల 579 కోట్ల వ్యయం అవుతుందన్నారు. పారిశ్రామిక, ఐటీ విప్లవాల మాదిరిగా త్వరలో బయో విప్లవం రాబోతోందని చెప్పారు. బయో టెక్నాలజీ, బయో సైన్స్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలున్నాయన్నారు.