Ayodhya: అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం ఇదే..!

Ayodhya: కృష్ణ శిలతో విగ్రహం తయారు చేసిన శిల్పి

Update: 2024-01-19 07:28 GMT

Ayodhya: అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం ఇదే..!

Ayodhya: అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ట్రస్ట్ విడుదల చేసింది. తొలిసారి బాలరాముడి విగ్రహాన్ని బాహ్య ప్రపంచానికి ఫొటోతో తెలియజెప్పింది. రాముడి విగ్రహానికి కళ్లకు గంతలు కట్టిన ఫొటోను విడుదల చేశారు. అయోధ్యలో ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇవాళ అగ్ని స్థాపన, నవగ్రహ స్థాపన జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ హాజరయ్యారు.

అయోధ్య రామ‌మందిరంలో బాల‌రాముడి విగ్రహ ప్రాణ‌ప్రతిష్ఠకు స‌మ‌యం స‌మీపిస్తుండ‌టంతో ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని వేద మంత్రోచ్ఛర‌ణ‌ల మ‌ధ్య గురువారం మ‌ధ్యాహ్నం ఆల‌య గ‌ర్భగుడిలోకి చేర్చారు. ఇక బాల‌రాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఫోటోల‌ను బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు ప్రకాశ్ జ‌వ‌దేక‌ర్ త‌న ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

51 అంగుళాల పొడ‌వు ఉన్న బాల‌రాముడి విగ్రహాం క‌ళ్లకు గంత‌లు క‌ట్టి ఉన్నాయి. రాముడు నిల్చున్న రూపంలో ద‌ర్శన‌మిస్తున్నారు. బాల‌రాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మరోవైపు అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నిన్న ముగ్గురు అనుమానితులు పోలీసులకు చిక్కడంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యలో అణువణవును గాలిస్తున్నాయి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అయోధ్య ఎన్.ఎస్.జి అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అనేక మంది ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు.

Tags:    

Similar News