Bhagwant Mann: చండీగఢ్‌ను తక్షణం పంజాబ్‌కి ఇవ్వండి..
Bhagwant Mann: ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చండీగఢ్‌ను వెంటనే పంజాబ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Bhagwant Mann: ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చండీగఢ్‌ను వెంటనే పంజాబ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంత హోదాలో చండీగఢ్ ప్రస్తుతం పంజాబ్-హర్యానాల సంయుక్త రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. శాంతి, సామరస్యాలను పరిరక్షించేందుకు ఈ నగరాన్ని వెంటనే పంజాబ్‌కు అప్పగించాలని ఆయన కోరారు.
గతంలో ఏదైనా రాష్ట్ర విభజన జరిగితే, రాజధాని నగరం మాతృ రాష్ట్రంతోనే ఉండేదని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం పేర్కొన్న సమాఖ్య సిద్దాంతాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని భగవంత్ మాన్ కోరారు. చండీగఢ్ పరిపాలనలో సమతుల్యతకు విఘాతం కలిగే చర్యలు తీసుకోవద్దన్నారు. ఈ తీర్మానం కోసమే పంజాబ్ శాసన సభ ఒక రోజు సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో కొద్ది సేపు గందగోళం ఏర్పడింది.