Train Tragedy: సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే కోరమండల్ ఇదే రోజున ప్రమాదం
14 ఏళ్ల క్రితం అంటే 2009లో..ఫిబ్రవరి 13న ఒడిశాలోనే కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగింది శుక్రవారం నాడే సమయం కూడా రాత్రి 07.00 గంటల సమయంలోనే.
Coromandel Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 250 కి చేరగా మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీ కొనడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. ఎందరో ప్రయాణీకులకు శుక్రవారం కాళరాత్రిగా మిగలగా ప్రస్తుత ఘటన 2009 నాటి ప్రమాదాన్ని గుర్తుకు తెస్తోంది. 14 ఏళ్ల క్రితం ఇదే రైలు శుక్రవారం నాడే ప్రమాదానికి గురైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, 14 ఏళ్ల క్రితం అంటే 2009లో..ఫిబ్రవరి 13న ఒడిశాలోనే కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగింది శుక్రవారం నాడే సమయం కూడా రాత్రి 07.00 గంటల సమయంలోనే. కోరమండల్ ఎక్స్ ప్రెస్ జైపూర్ రోడ్ రైల్వే స్టేషన్ దాటుతోంది. అయితే ట్రాక్ మార్చుకుంటన్న సమయంలో అతివేగం కారణంగా రైలు అదుపుతప్పి బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇంజన్ వెళ్లి పక్క ట్రాక్ మీద పడింది. పలు బోగీలు ట్రాక్ మీద పడిపోయాయి. నాటి ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. తాజా ఘటన సైతం శుక్రవారం రోజునే, అది కూడా రాత్రి 07:00 గంటల సమయంలోనే జరగడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.