Reverse Train: కిలోమీటర్ వెనక్కి నడిచిన రైలు..ఎక్కడంటే?
*కేరళలో ఓ ట్రైన్ కిలోమీటర్ వెనక్కి నడిచింది. ఆగాల్సిన స్టేషన్ వచ్చినా లోకో పైలెట్ బ్రేకులు వేయకపోవడంతో స్టేషన్ దాటుకొని ముందుకు వెళ్లింది. దిగాల్సిన స్టేషన్ వచ్చినా ట్రైన్ ఆగకపోవడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.
Reverse Train: సాంకేతిక లోపంతో రైలు వెనక్కి నడిచిన ఉదంతాలను మనం చాలా చూశాం..కానీ, ఎలాంటి లోపం లేకుండానే ఒక రైలు వెనక్కి నడిచింది. అలా వెనక్కి నడిచి ప్రయాణీకులను ఎక్కించుకుంది. ఈ వింత ఘటన కేరళలో చోటు చేసుకుంది. పూరి వివరాల్లోకి వెళితే..కేరళలోని చెరియనాడ్ గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఒక రైల్వే స్టేషన్ ఉంది. స్టేషన్ చిన్నదే అయినా..ఎక్స్ ప్రెస్ రైళ్లు సైతం ఇక్కడ ఆగుతాయి. త్రివేండ్రం-షోరనూర్ మధ్య నడిచే వేనాడ్ సైతం ఆ స్టేషన్ లో ఆగాలి..కానీ ఆదివారం నాడు ఆ ట్రైన్ చెరియనాడ్ చేరుకుంది కానీ, ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది.
చెరియనాడ్ స్టేషన్ లో ట్రైన్ ఆగకపోవడంతో స్టేషన్ మేనేజర్ గమనించి లోకో పైలట్ ను అప్రమత్తం చేశారు. దీంతో లోకో పైలట్ బ్రేకులు అప్లయ్ చేసినా..రైలు కిలోమీటర్ దూరం వెళ్లి ఆగింది. అటు రైలులో ఉన్న ప్రయాణీకులతో పాటు స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకులు సైతం ఆందోళన వ్యక్తం చేయడంతో రైలును లోకో పైలట్ వెనక్కి నడుపుతూ స్టేషన్ కు తీసుకొచ్చారు.
కమ్యునికేషన్ లోపం వల్లే ట్రైన్ ఆగకుండా ముందుకు వెళ్లిందని రైల్వే అధికారులు అన్నారు. అయితే స్టేషన్ చిన్నది కావడంతో ఎక్స్ ప్రెస్ రైలు ఇక్కడ ఆగడం ఏంటని..లోకో పైలట్ భావించాడో ఏమో..ఆగకుండా రైలును పరుగులు తీయించాడు. మొత్తానికి, వెనక్కి నడుస్తున్న రైలును చూసి ప్రయాణీకులతో పాటు స్థానికులు చూసి ఇదేం చోద్యమంటూ వింతగా చూశారు. మొత్తంగా ఆగాల్సిన చోట ఆగకుండా ట్రైన్ ముందుకు వెళ్లిపోవడంతో ఆ స్టేషన్ లో దిగాల్సిన ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. హైజాక్ చేశారా లేక బ్రేకులు ఫెయిల్ అయ్యాయా అంటూ భయపడ్డారు. కానీ, లోకో పైలెట్ తన తప్పును తెలుసుకొని ట్రైన్ ను వెనక్కి నడపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.