Top 6 News Of The Day: కేంద్రానికి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్

Update: 2024-09-13 13:33 GMT

1) కేంద్రానికి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్

తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ఆయన సమావేశమయ్యారు. వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలన్నారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్నేరు వాగుకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

2) రేవంత్ రెడ్డినే ఆంధ్రా, తెలంగాణ అంటూ రెచ్చగొడుతున్నారన్న పాడి

కాంగ్రెస్ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా, తెలంగాణ అంటూ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్‌ చంద్రబాబు ట్రాప్‌లో పడి అందరినీ అమరావతి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.

3) టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతకంటే ముందుగా ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ కారణంగానే వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్‌లకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. విచారణకు జోగి రమేష్, దేవినేని అవినాష్‌లు సహకరించాలని.. 48 గంటల్లోగా పాస్‌పోర్ట్‌లు సమర్పించాలని ఆదేశించింది. నవంబర్ 4వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వైసీపీ తరఫున న్యాయవాదులు కపిల్ సిబల్, నీరజ్ కిషన్ కౌశల్, అల్లంకి రమేష్ తమ వాదనలు వినిపించారు.

4) వాళ్లను ఏపీ సర్కారు పట్టించుకోలేదన్న జగన్

విజయవాడ మాదిరిగానే ఏలూరు వరదల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు మాజీ సీఎం జగన్. అధికారులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్‌మెంట్‌లోనూ నిర్లక్ష్యం వహించిందన్నారు. భారీ వర్షాలు ఉన్నాయని ఐఎండీ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయలేదని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు .

5) కేజ్రీవాల్‌కు బెయిల్.. షరతులు ఏంటంటే..

అరవింద్ కేజ్రీవాల్ కు దిల్లీ లిక్కర్ స్కాంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిలిచ్చింది. ఇదే కేసులో ఈడీ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. కోర్డు ఆర్డర్ జైలు అధికారులకు అందించిన తర్వాత ఆయన విడుదలకానున్నారు. బెయిల్ కండిషన్లు ఇవీ... దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసే సమయంలో కొన్ని షరతులను విధించింది. 10 లక్షల పూచీకత్త, ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసుకు సంబంధించి బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కూడా కోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని, అధికారిక ఫైళ్లపై సంతకాలు కూడా చేయవద్దని కూడా తెలిపింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) పోర్ట్ బ్లెయిర్ పేరు మార్చిన కేంద్రం.. కారణం ఏంటంటే..

అండమాన్ అండ్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కి పేరు మార్చుతూ కేంద్రం ప్రకటన చేసింది. ఇకపై పోర్ట్ బ్లెయిర్‌ని శ్రీ విజయ పురం అని పిలవనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. మన దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అండమాన్ నికోబార్ దీవులకు ప్రత్యేక స్థానం ఉందని.. అలాంటి ప్రదేశానికి ఇప్పటికీ బ్రిటీష్ రాజ్యాన్ని గుర్తుచేస్తూ పోర్ట్ బ్లెయిర్ పేరును కొనసాగించకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా ప్రకటించారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News