Top 6 News @ 6 PM: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు మరో కీలక ముందడుగు.. రజనీకాంత్ తర్వాత సమంతే.. మరో టాప్ 4 న్యూస్ హెడ్‌లైన్స్
Top 6 News @ 6 PM: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు మరో కీలక ముందడుగు.. రజనీకాంత్ తర్వాత సమంతే.. మరో టాప్ 4 న్యూస్ హెడ్‌లైన్స్
1) KTR: కమీషన్ల కోసమే మూసీ సుందరీకరణ
కమీషన్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ అంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మూసీ పేరు మీద.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలు డబ్బులు పంచుకుంటారని ఆయన ఆరోపించారు.సంక్షేమ పథకాల అమలుకు లేని డబ్బులు మూసీ సుందరీకరణకు ఎక్కడివని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్.
శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు అల్లావుద్దీన్ పటేల్‌కి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోన్న కాంగ్రెస్‌కు హర్యానా ప్రజలు బుద్ది చెప్పారన్నారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొండగల్ లో రైతల భూములను ప్రభుత్వం గుంజుకుంటోందని ఆరోపణలు గుప్పించారు కేటీఆర్.
2) Revanth Reddy: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు మరో కీలక ముందడుగు
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు మరో కీలక ముందడుగు పడింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని సూచించారు. 24గంటల్లో కమిషన్ కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని .. ఆ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం. ఇందుకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు.
కమిషన్ ఏర్పాటుకు 24 గంటల్లో ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటినీ ఏర్పాటు చేసింది. ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని సబ్ కమిటీ సూచించింది.
3) AP Liquor Shops Tenders: ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. మద్యం టెండర్లలో షెడ్యూల్ లో మార్పులు
రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణకు మరో రెండు రోజులు గడువున పొడిగించింది. మొదట జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితో గడువు ముగిసింది. ఈనెల 11 వ తేదీ సాయంత్రం వరకు గడువు పెంచారు. 14వ తేదీన లాటరీ తీసి లైసెన్సులు ఇవ్వనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త లైసెన్స్ దారులు దుకాణాలు ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానున్నాయి. మొత్తం 3,390 దుకాణాలకు లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది. రాత్రి తొమ్మిది గంటల వరకు 41 వేల 348 దరఖాస్తులు వచ్చాయి.
మనాన్ రిఫండబుల్ ఫీజు రూపంలో 826.96 కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు. గడువు పొడిగింపు నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తిరుపతి, విశాఖ పట్నం, పొట్టి శ్రీరారములు నెల్లూరు, అనకాపల్లి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో నోటిఫై చేసిన దుకాణాల సంఖ్యతో పోలిస్తే వచ్చిన దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉంది.
4) Haryana Polls: హర్యానా ఓటమి తరువాత కాంగ్రెస్‌కి మరో ఊహించని షాక్.. అది కూడా మిత్రపక్షాల నుండే
Haryana Result 2024: హర్యానాలో ఓటమి దిగులుతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో ఊహించని పరిణామం ఎదురైంది. ఇండియా బ్లాక్ కూటమిలోనే కొన్ని మిత్రపక్షాలు హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ వైఖరే కారణమని మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని ఉద్దవ్ బాల్ థాకరే శివసేన పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై బాహటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. ఓవర్-కాన్ఫిడెన్స్, అహంకారపూరిత వైఖరే కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణాలు అని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) Trivikram: రజనీకాంత్ తర్వాత సమంతే.. త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు
Trivikram Praises Samantha: అలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'జిగ్రా'. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 11వ తేదీన ఈ చిత్రాన్ని సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా రానా దగ్గుబాటి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) CT Final: పాక్‌కు బిగ్ షాకిచ్చిన భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదికలో మార్పు?
Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ ఐసీసీ టోర్నీ నిర్వహణకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సన్నాహాల్లో బిజీగా ఉంది. అయితే, టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనే విషయంపై అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ కచ్చితంగా పాకిస్థాన్‌కు వస్తుందని పీసీబీ చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ టోర్నీ ఫైనల్ స్థానాన్ని భారత్ బట్టి నిర్ణయించవచ్చని ఒక నివేదిక వచ్చింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.