Jharkhand Assembly Election Results 2024: కాసేపట్లో జార్ఖండ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ..ఎన్డీఏ, జేఎంఎం మధ్యే టగ్ ఆఫ్ వార్

Jharkhand Assembly Election Results 2024: ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. నేడు తాడో పేడో ఈ ఫలితాలతో తేలిపోనుంది. మరికాసేపట్లో కౌంటింగ్ షురూ అవుతుంది. 81 నియోజకవర్గాలకు రెండు విడతలుగా పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-23 01:54 GMT

Jharkhand Assembly Election Results 2024: కాసేపట్లో జార్ఖండ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ..ఎన్డీఏ, జేఎంఎం మధ్యే టగ్ ఆఫ్ వార్

Jharkhand Assembly Election Results 2024: జార్ఖండ్‌లో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు 23 నవంబర్ 2024న శనివారం విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ హేమంత్ సోరెన్‌కు చెందిన జేఎంఎం నేతృత్వంలోని మహాకూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేల మధ్యే ఉంది. మరోవైపు, ఎన్నికల ఫలితాలకు ముందు హేమంత్ సోరెన్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది.

ప్రజల పల్స్, ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చూస్తుంటే పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. అయితే ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సబంధించి అధికారులు ఏర్పాట్లన్నీ చేశారు. 81 నియోజకవర్గాలకు గాను 41 స్థానాల్లో ఎవరు గెలుస్తారో వారిదే అధికారం కాబోతోంది. కాగా కౌంటింగ్ కేంద్రాలకు రెండు కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో జేఎంఎం డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాలకు చెందిన ఎలక్ట్రానిక్ నిపుణులను ఇక్కడ మోహరిస్తోందని జార్ఖండ్ ముక్తి మోర్చా ఆరోపించింది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా నిషేధించాలని జేఎంఎం డిమాండ్ చేసింది.

జార్ఖండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలకు గాను 59 స్థానాలను మహాకూటమి గెలుస్తుందని జార్ఖండ్ ముక్తి మోర్చా కేంద్ర ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య జాబితాను విడుదల చేస్తూ ప్రకటించారు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 11 జిల్లాల్లో ఎన్డీయే ఖాతా తెరవబోమని చెప్పారు. రాష్ట్రంలోని మిగిలిన 13 జిల్లాల్లో ఒక్కో సీటుపై ఎన్డీయే గట్టిపోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News