Top 6 News @ 6 PM: ఏపీలో వరద పరిహారం అందని బాధితులకు గుడ్‌న్యూస్.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్
1) Vangalapudi Anitha: బాలిక ఘటనపై వైసీపీ రాజకీయం చేస్తోంది
చిత్తూరు జిల్లా పుంగనూరులో బాలిక ఘటనపై వైసీపీ రాజకీయం చేస్తోందని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారని తెలిపారు. బాలికపై అత్యాచారం జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు..అత్యాచారం జరగలేదని పోస్ట్‌మార్టం రిపోర్టులో ఉందన్నారు. నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాలిక కుటుంబాన్ని అనిత పరామర్శించారు.
2) AP News: ఏపీలో వరద పరిహారం అందని బాధితులకు గుడ్‌న్యూస్
AP News: ఏపీలో వరద పరిహారం అందని బాధితులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సోమవారం సాయంత్రం వరకు బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపింది. 21వేల 768 మంది వరద బాధితుల బ్యాంక్ ఖాతాల్లో పొరపాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పొరపాట్లు సరిచేసి వరదసాయం జమచేస్తామని...బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అధికారులు హామీనిచ్చారు.
3) KTR: అన్నదాతలారా ఆత్మస్థైర్యం కోల్పోకండి..!
కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు. కాంగ్రెస్ పాలనలో రైతులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఓ వైపు సాగునీటి సంక్షోభం, మరోవైపు రుణమాఫీ ద్రోహం..ఇంకోవైపు రైతుభరోసా మోసం, అందని కౌలు సాయం అంటూ ట్వీట్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎంకు సోయిలేదా అంటూ మండిపడ్డారు. వ్యవసాయాన్ని దండుగలా మార్చిన సీఎంకు దండన తప్పదని.. అన్నదాతలారా ఆత్మస్థైర్యం కోల్పోకండని మనోధైర్యాన్నిచ్చారు కేటీఆర్.
4) Kishan Reddy: గోవా కి నేరుగా రైలును ప్రారంభించడం సంతోషంగా ఉంది
సికింద్రాబాద్ – గోవా వెళ్లే రైలు ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని భోయి గూడా వైపు గల పదో నెంబర్ ప్లాట్ ఫారం పై నుంచి గోవా రైలు సర్వీస్ ను ప్రారంభించారు. తెలంగాణ రాజధానితో గోవా రాజధాని వాస్కో-డ-గామాతో మెరుగైన అనుసంధానం చేశారు. ఈ రైలు వారానికి రెండు రోజులు ఇరు మార్గాలలో నడపబడుతోంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గోవాకి నేరుగా రైలును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
5) Car On Railway Tracks: రైలు పట్టాలపై రైలుకి ఎదురొచ్చిన కారు.. షాకైన లోకోపైలట్ ఏం చేశారంటే..
రైలు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు పెట్టడం, సిమెంట్ దిమ్మెలు పెట్టి రైలు ప్రమాదాలకు కుట్రపన్నిన ఘటనలు ఇటీవల కాలంలో ఉత్తర్ ప్రదేశ్‌లో అనేకం చోటుచేసుకున్నాయి. వాటి నుండి రైల్వే శాఖ ఇంకా తేరుకోకముందే తాజాగా యూపీలోనే రైలు పట్టాలపై కారు రైలుకి ఎదురు రావడం ఆ రైలు లోకో పైలట్ షాకయ్యేలా చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుండి లక్నో వైపు వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలట్‌కి శనివారం ఈ వింత అనుభవం ఎదురైంది. రైలు పట్టాలపై కారు కదులుతుండటం చూసి విస్మయానికి గురైన లోకోపైలట్ వెంటనే తేరుకుని ఎమర్జెన్సీ బ్రేక్స్ వేశాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) Israel Attacks Gaza: గాజా మసీదుపై ఇజ్రాయెల్ బాంబులు.. 24 మంది హతం
ఇజ్రాయెల్ మరోసారి గాజాపై వైమానిక దాడులకు పాల్పడింది. గాజాలోని ఒక పెద్ద మసీదుపై ఆదివారం అర్ధరాత్రి దాటాకా 2 గంటల ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. ఈ దాడిలో మసీదు దాదాపు ధ్వంసమైంది. 24 మంది చనిపోయారు. హమాస్ ఈ మసీదు నుండే కమాండ్ కంట్రోల్ సెంటర్ నడిపిస్తూ మిలిటెంట్ కార్యకలాపాలకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అయితే, అల్-జజీరా కథనం ప్రకారం.. గాజాలో వరుస దాడులతో ఆశ్రయం కోల్పోయి రోడ్డున పడిన పౌరులే ఈ మసీదులో తలదాచుకుంటున్నారని తెలుస్తోంది. ఉత్తర గాజా, దక్షిణ బెరూత్‌పై పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్లు వార్తలొస్తున్నాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.