Exit Polls: గురి తప్పిన ఎగ్జిట్ పోల్స్.. అంచనాలు అన్ని తలకిందులు..

Exit Polls: 2004లో ఎనిమిది నెలల పదవీ కాలం ఉండగానే, అప్పటి ప్రధాని వాజ్‌పేయీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లింది.

Update: 2024-06-01 15:30 GMT

Exit Polls: గురి తప్పిన ఎగ్జిట్ పోల్స్.. అంచనాలు అన్ని తలకిందులు..

Exit Polls: 2004లో ఎనిమిది నెలల పదవీ కాలం ఉండగానే, అప్పటి ప్రధాని వాజ్‌పేయీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లింది. అంతకు కొద్దిరోజుల ముందే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపూ ముందస్తుకు వారిని పురిగొల్పింది. ఆ సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం తిరిగి ఎన్డీయేనే అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చెప్పాయి. ఎన్డీయే కూటమికి 330 సీట్లు వస్తాయని ఇండియా టుడే, 270కి కాస్త అటూఇటూగా రావచ్చొని మిగతా సంస్థలు అంచనా వేశాయి. కానీ, ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. ఎన్డీయే కూటమి కేవలం 181 స్థానాలకే పరిమితం కాగా.. మెజార్టీ సీట్లతో యూపీఏ అధికారంలోకి వచ్చింది.

బిహార్‌ అసెంబ్లీకి 2015లో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. జేడీయూ-ఆర్జేడీ జట్టుగా బరిలోకి దిగిన ఈ పోరులో.. బీజేపీ కూటమికే మొగ్గు ఉన్నట్లు తేల్చాయి. అయితే, అందుకు విరుద్ధంగా జేడీయూ-ఆర్జేడీకి సంయుక్తంగా 178 సీట్లుగా రాగా.. బీజేపీ పక్షాలు 58తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ హంగ్‌ ఏర్పడుతుందని చెప్పాయి. కానీ, 202 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి పాలనా పగ్గాలు చేపట్టింది.

పంజాబ్‌ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ సర్వే సంస్థలన్నీ ఆప్‌కే పీఠం అని నొక్కి చెప్పాయి. కానీ, 77 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌.. ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేసింది. బిహార్‌లో 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు సంస్థలు ఆర్జేడీకి అనుకూలంగా సర్వే ఫలితాలు ఇచ్చాయి. కానీ, బీజేపీ-జేడీయూ కూటమి అధికారం చేపట్టింది.

Tags:    

Similar News