PM Modi: ప్రజలు న్యాయవ్యవస్థపై ఎప్పుడూ అపనమ్మకంతో లేరు

PM Modi: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ 75 ఏళ్ల వార్షికోత్సవం పురస్కరించుకుని జిల్లా న్యాయవ్యవస్థపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు.

Update: 2024-08-31 10:51 GMT

PM Modi: ప్రజలు న్యాయవ్యవస్థపై ఎప్పుడూ అపనమ్మకంతో లేరు

PM Modi: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ 75 ఏళ్ల వార్షికోత్సవం పురస్కరించుకుని జిల్లా న్యాయవ్యవస్థపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత మండపంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ జ్యుడీషియర్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా.. సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకలకు గుర్తుగా.. ఒక స్మారక స్టాంప్, నాణెం విడుదల చేశారు. సుప్రీంకోర్ట్ ఆధ్వర్యంలో రెండ్రోజులు కాన్ఫరెన్స్ జరగనుంది.

ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన జిల్లాల జ్యుడీషియరీల సభ్యులు 800 మందికి పైగా పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, భారత అటార్నీ జనరల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టు అనేది ఓ న్యాయ వ్యవస్థ మాత్రమే కాదన్న మోడీ.. దాని ప్రయాణం.. అంతకుమించినది అన్నారు. ఇది భారత రాజ్యాంగం ప్రయాణం, దాని విలువలు, అలాగే భారతదేశం ప్రగతినీ, ప్రజాస్వామ్యంగా ఎదిగిన తీరును ప్రతిబింబిస్తుంది అన్నారు.

మహిళలపై అఘాయిత్యాల కేసుల్లో ఎంత వేగంగా న్యాయం జరుగుతుందో.. అప్పుడే వారి భద్రతపై ఎక్కువ భరోసా ఏర్పడుతుందన్నారు. స్త్రీల భద్రత కోసం కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ, వాటిని మరింత సమర్థంగా చేయడం అవసరం అన్నారు. మహిళలపై హింసకు సంబంధించిన కేసుల్లో త్వరగా తీర్పు ఇస్తే, మన జనాభాలో సగం అయిన స్త్రీలు తమ భద్రతపై మరింత నమ్మకంతో ఉంటారన్నారు.

2019లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు చట్టాన్ని తీసుకొచ్చామని దీని ద్వారా సాక్షులను రక్షించే కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. జిల్లా పర్యవేక్షక బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని... వీటిని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అది జరిగినప్పుడే మహిళలపై నేరాల విషయంలో వేగంగా తీర్పులు వెలువడతాయన్నారు.

Tags:    

Similar News