Election Results: హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవే..ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయంటే?

Haryana and Jammu Kashmir Assembly elections: హర్యానా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీకి అధికారం దక్కించుకుంది. జమ్మూలో నేషనల్ కాన్ఫెరెన్స్ -కాంగ్రెస్ కూటమికి విజయం వరించింది.

Update: 2024-10-09 01:20 GMT

 Election Results: హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవే..ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయంటే?

Haryana and Jammu Kashmir Assembly elections: హర్యానాలో అధికార బీజేపీకి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం 90 స్థానాల్లో బీజేపీ 48, కాంగ్రెస్ 37, ఐఎన్ఎల్ డి 2, ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును స్థానిక పార్టీలు, ఇండిపెండెంట్లు చీల్చాయి. దీంతో బీజేపీ సులభంగా విజయం సాధించింది.

జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి మెజార్టీ సీట్లు దక్కాయి. దీంతో త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నాయి. జమ్మూకశ్మీర్ మొత్తం 90 స్థానాల్లో మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా నేత్రుత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 42 సీట్లు, బీజేపీకి 29 సీట్లు కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాలు, జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి 3 స్థానాలు, జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీకి 1, సీపీఐకి 1, ఆమ్ ఆద్మీపార్టీకి 1 సీటు, ఇండింపెండెన్స్ అభ్యర్థులకు 7 స్థానాలు దక్కాయి.

ఇక జమ్మూకశ్మీర్ లో బీజేపీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అదే సమయంలో, నేషనల్ కాన్ఫరెన్స్ అద్భుతమైన పనితీరును కనబరిచినందుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు కూడా తెలిపారు. ప్రధాని మోదీ అభినందన సందేశంపై ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు.

జమ్మూకశ్మీర్‌లో ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని ప్రధాని మోదీ అన్నారు. ఆర్టికల్ 370, 35(ఎ) రద్దు తర్వాత తొలిసారిగా ఈ ఎన్నికలు జరగ్గా, భారీ సంఖ్యలో ఓట్లు వచ్చాయి. దీని వల్ల ప్రజాస్వామ్యంపై ప్రజల్లో విశ్వాసం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతి ఒక్కరికీ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ పనితీరు చూసి గర్వపడుతున్నానని ప్రధాని మోదీ అన్నారు. మా పార్టీకి ఓటు వేసిన వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. జమ్మూ కాశ్మీర్ సంక్షేమం కోసం మేము నిరంతరం కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాను అని ప్రధాని అన్నారు.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అద్భుతంగా పనిచేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మెచ్చుకోదగిన పనితీరు కనబరిచినందుకు నేషనల్ కాన్ఫరెన్స్‌ను నేను అభినందిస్తున్నాను అని ప్రధాని అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ అభినందన సందేశంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఒమర్ మాట్లాడుతూ, మీ అభినందన సందేశానికి చాలా ధన్యవాదాలు నరేంద్ర మోదీ సార్. జమ్మూ కాశ్మీర్ ప్రజలు స్థిరమైన అభివృద్ధి, సుపరిపాలన నుండి ప్రయోజనం పొందగలిగేలా, ఫెడరలిజం నిజమైన స్ఫూర్తితో నిర్మాణాత్మక సంబంధం కోసం మేము ఎదురుచూస్తున్నాము అంటూ బదులిచ్చారు.

Tags:    

Similar News