Ration Card: రేషన్ కార్డుదారులకి గమనిక.. వ్యవస్థ మొత్తం మారుతోంది..!
Ration Card: మీకు రేషన్ కార్డు ఉంటే ఈ న్యూస్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
Ration Card: మీకు రేషన్ కార్డు ఉంటే ఈ న్యూస్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం రేషన్ షాపుల వ్యవస్థను పూర్తిగా మార్చాలని ఆలోచిస్తోంది. ఇప్పుడు రేషన్ షాపులను సీసీ కెమెరాలతో పర్యవేక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కాకుండా హెల్ప్‌లైన్ నంబర్ సిస్టమ్‌ని మెరుగ్గా ఉండేలా చేస్తున్నారు. రేషన్ షాపులపై నిఘా ఉంచేందుకు ఆకస్మిక తనిఖీలకు ఏర్పాట్లు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది.
లబ్ధిదారుల తరపున ఆహార, ప్రజాపంపిణీ శాఖలో క్వాలిటీ కంట్రోల్ సెల్ ఉన్నప్పటికీ ఆచరణలో అంతగా ప్రభావం చూపలేకపోతుంది. దీనివల్ల లబ్ధిదారులు తమ ఫిర్యాదులను సంబంధిత ఏజెన్సీలకు తెలియజేయలేకపోతున్నారు. ఒక్కోసారి అధికారులకి ఎన్నిసార్లు కాల్స్ చేసినా తీయడం లేదని పలువురు లబ్ధి దారులు ఆరోపిస్తున్నారు. 1967, 1800 టెలిఫోన్ నంబర్ల ద్వారా వివిధ రాష్ట్రాల్లో 24 గంటల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఉంది. కానీ లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి ఇది ఉపయోగపడడం లేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చింది.
ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ల పనితీరు మెరుగుపరచాలని, ప్రజా జవాబుదారీతనాన్ని పెంపొందించాలని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను పటిష్టం చేసి రేషన్ షాపులపై నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. నాణ్యత సమస్యలని పరిష్కరించడానికి, నియంత్రించడానికి సమగ్ర నాణ్యత నియంత్రణ సెల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది.