రేపట్నుంచి జీ-20 సదస్సు.. సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోడీ

* బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యే అవకాశం

Update: 2022-11-14 02:56 GMT

రేపట్నుంచి జీ-20 సదస్సు.. సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోడీ

G-20 Summit: ఇండోనేషియాలోని బాలీలో జీ-20 సదస్సుకు వేదిక సిద్ధమైంది. రేపు, ఎల్లుండి జీ-20 సమ్మిట్ జరగనుంది. కోవిడ్-19, ఆర్థిక పునరుద్ధరణ, రష్యా-ఉక్రెయన్ యుద్ధం, ఐరోపా సంక్షోభం, ఇంధన భద్రత, ఆహార భద్రత సవాళ్లు, ద్రవ్యోల్బనం, ఆర్థిక మాంద్యం వంటి అంశాలపై జీ20 దేశాలు చర్చించనున్నాయి. ప్రధాని మోడీ నేటి నుంచి మూడు రోజుల పాటు ఇండోనేషియాలోనే పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం ప్రధాని మోడీ ఇవాళ బాలీకి బయలుదేరతారు. జీ20 సదస్సులో భాగంగా 10 మంది ప్రపంచాధినేతలతో మోడీ సమావేశవుతారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.

జీ20 సదస్సులో భాగంగా ఆహారం, ఇంధన భద్రత, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అండ్‌ హెల్త్‌ వంటి మూడు కీలక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వంటి అంశాలపై మోడీతోపాటు ఇతర నేతలు చర్చిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌, జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఓలఫ్‌ షోల్జ్‌తోపాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాత్రం ఈ సమావేశాలకు హాజరు కావడం లేదని తెలుస్తోంది.

ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20 నిర్వహణ బాధ్యతలను డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి భారత్‌ స్వీకరించనుంది. వచ్చే ఏడాది జీ20 సమ్మిట్ ఇండియాలో జరగనుంది. ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ప్రధాని మోడీ లాంఛనప్రాయంగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు. 2023 సెప్టెంబర్‌లో జీ 20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

Tags:    

Similar News