Jamshedpur: జార్ఖండ్‌లో అదృశ్యమైన విమానం..కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Jamshedpur: జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ విమానం అదృశ్యమైంది. టేకాఫ్ అయిన 50 నిమిషాలకే విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. విమానం జాడ ఇంకా దొరకలేదు.
Jamshedpur: జంషెడ్‌పూర్ జిల్లాలోని సోనారీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఓ విమానానికి సంబంధాలు తెగిపోయాయి. విమానం జాడ ఇంకా దొరకలేదు. విమానం కొండపై కూలిపోయిందని వార్తలు వచ్చినప్పటికీ, అదృశ్యమై చాలా గంటలు గడిచినా, విమానం గురించి ఎటువంటి సమాచారం లేదు. ఆల్కెమిస్ట్ ఏవియేషన్‌కు చెందిన శిక్షణ విమానం మంగళవారం మధ్యాహ్నం జంషెడ్‌పూర్‌లోని సోనారీ విమానాశ్రయం నుండి బయలుదేరిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గల్లంతైన విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మంగళవారం ఉదయం జంషెడ్‌పూర్‌లోని సోనారీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన తర్వాత అదృశ్యమైన ఆల్కెమిస్ట్ ఏవియేషన్ శిక్షణ విమానం చాలా గంటలు గడిచినా ఆచూకీ లభించలేదు. విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విమానంలో పైలట్ కాకుండా మరో ట్రైనీ కూడా ఉన్నట్లు సమాచారం. ఈస్ట్ సింగ్‌భూమ్, సెరైకెలా జిల్లా యంత్రాంగం సహాయంతో విమానాశ్రయ యాజమాన్యం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇది రెండు సీట్ల సెస్నా 152 విమానం అని, సోనారీ విమానాశ్రయం నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అయితే విమానం టేకాఫ్ అయిన 50 నిమిషాల తర్వాత, 11.20కి విమానంతో సంబంధాలు తెగిపోయాయి. జంషెడ్‌పూర్‌కు వాయువ్యంగా ఉన్న చండిల్-దాల్మా వైపు విమానం చివరి ప్రదేశం కనుగొన్నట్లు అధికారలు తెలిపారు.
ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున, తూర్పు సింగ్‌భూమ్, సెరైకెలా-ఖర్సవాన్ జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించారు. సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ చిన్న విమానంలో అంత సేపు ప్రయాణించేందుకు సరిపడా ఇంధనం లేదు. అటువంటి పరిస్థితిలో, విమానం కూలిపోయే అవకాశం చాలా బలంగా ఉంది. ఈ విషయంపై సమాచారం ఇస్తుండగా, సెరైకెలా జిల్లా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ, "శిక్షణా విమానం తప్పిపోయినట్లు మాకు సమాచారం అందింది. సెరైకెలా జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాం. జంషెడ్‌పూర్ యంత్రాంగం కూడా సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు తెలిపారు.