Union Budget 2020 : కేంద్రానికి రూపాయి రాక ఇలా.. పోకడ అలా!
22లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యయం మాత్రం 30లక్షల కోట్లుగా ప్రకటించారు.
22లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యయం మాత్రం 30లక్షల కోట్లుగా ప్రకటించారు. అయితే, ఆదాయానికి వ్యయానికి భారీ తేడా ఉండటంతో ద్రవ్యలోటును 3.5శాతంగా అంచనా వేశారు. ఇక, వివిధ పథకాలకు వేల కోట్ల రూపాయిల కేటాయింపులు చేసిన నిర్మలా సీతారామన్ రూపాయి రాక రూపాయి పోకపై వివరణ ఇచ్చారు.
2020-21 ఆర్ధిక సంవత్సరానికి 22 లక్షల 46వేల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్‌ను ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే, వ్యయం మాత్రం 30లక్షల 42వేల కోట్లుగా ప్రకటించారు. ఇక, ద్రవ్యలోటును 3.5శాతంగా అంచనా వేశారు. అలాగే, ఈ ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ లక్ష్యాన్ని 10శాతంగా నిర్ణయించుకున్నట్లు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అయితే, వివిధ పథకాలకు వేల కోట్ల చొప్పున కేటాయంపులు చేసిన నిర్మలా సీతారామన్ ఆదాయ వ్యయాలపై వివరణ ఇచ్చారు.
కేంద్రానికి వచ్చే ఆదాయంలో అధిక శాతం జీఎస్టీ వసూళ్లు కార్పొరేట్ పన్ను ద్వారానే సమకూరుతోంది. జీఎస్టీ ఆదాయం 18శాతం కాగా కార్పొరేట్ పన్నాదాయం కూడా 18శాతంగా ఉంది. ఆ తర్వాత ఆదాయపు పన్ను ద్వారా 17శాతం ఇన్‌కమ్ కేంద్రానికి వస్తోంది. అలాగే, పన్నేతర ఆదాయం 10శాతం కాగా రుణేతర మూలధన వసూళ్లు 6శాతం ఎక్సైజ్ పన్ను 7శాతం కస్టమ్స్ ఆదాయం 4శాతంగా ఉన్నాయి. అయితే, 80శాతం ఆదాయం వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి సమకూరుతుండగా మిగిలిన 20శాతం ఇన్‌కమ్ కోసం రుణాలపైనే కేంద్రం ఆధారపడుతోంది.
రూపాయి రాక
ఆదాయపు పన్ను - 17శాతం
రుణేతర మూలధన వసూళ్లు - 6శాతం
రుణాలు - 20శాతం
పన్నేతర ఆదాయం - 10శాతం
జీఎస్టీ ఆదాయం 18 శాతం
కార్పొరేట్ పన్ను 18శాతం
కేంద్ర ఎక్సైజ్ పన్ను 7శాతం
కస్టమ్స్ ఆదాయం 4శాతం
ఇక కేంద్రానికి వచ్చే ఆదాయంలో 20శాతాన్ని రాష్ట్రాల పన్నుల వాటా కింద బడ్జెట్‌లో కేటాయింపలు చేస్తోంది. ఆ తర్వాత అత్యధికంగా రుణాలపై వడ్డీ చెల్లింపులకు 18శాతం ఆదాయాన్ని వెచ్చిస్తోంది. ఇక, సబ్బిడీలకు 6శాతం కేంద్ర ప్రాయోజిత పథకాలకు 9శాతం ఇతర ఖర్చులు 10శాతం ఆర్ధిక సంఘానికి 10శాతం... ఫించన్లకు 6శాతం... కేంద్ర పథకాలకు 9శాతం కేటాయిస్తుండగా... ఒక్క రక్షణ రంగానికే 8శాతం నిధులను కేంద్రం ఖర్చు పెడుతోంది.
రూపాయి పోక
రాష్ట్రాల పన్నుల వాటా 20శాతం
వడ్డీ చెల్లింపులు 18శాతం
సబ్బిడీలు 6శాతం
కేంద్ర ప్రాయోజిక పథకాలు 9శాతం
ఇతర ఖర్చులు 10శాతం
ఆర్ధిక సంఘం, ఇతర కేటాయింపులు 10శాతం
ఫించన్లు 6శాతం
కేంద్ర పథకాలు 9శాతం
రక్షణ రంగం 8శాతం
అయితే, కేంద్రానికి సమకూరుతోన్న ఆదాయపు అంచనాలతో 22.46 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.... వ్యయం మాత్రం 30.42లక్షల కోట్లుగా ప్రకటించింది. దాంతో, దవ్రలోటు 3.5శాతంగా అంచనా వేసింది.