హిజాబ్ వివాదంపై ఇవాళ కర్ణాటక హైకోర్టులో విచారణ
Karnataka: హైకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ.
Karnataka: హిజాబ్ వివాదంపై ఇవాళ కర్ణాటక హైకోర్టులో విచారణ జరగనుంది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ్టి నుంచి ఈనెల 19 వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. అయితే ఉడిపి, చిక్‌మంగళూర్‌లో మాత్రం స్కూళ్లు ఓపెన్ చేశారు. హిజాబ్ వివాదం కొనసాగుతున్న వేళ.. కర్ణాటకలో (Karnataka) పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. విద్యా సంస్థల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో వివాదం ప్రారంభమయింది. క్రమంగా ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వ్యాపించింది.
దీంతో రెండు వర్గాల విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు మూసేస్తున్నట్టు ప్రభుత్వం గత మంగళవారం ప్రకటించింది. అయితే పరిస్థితుల్లో కొంతమేరకు మార్పు రావడంతో నేటి నుంచి విడతలవారీగా విద్యా సంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వరకు పాఠశాలలు సోమవారం తెలరచుకున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ఇతర విద్యాసంస్థలను తెరుస్తామని సీఎం ప్రకటించారు.
ఉడుపి జిల్లాలో మొదలైన హిజాబ్ వివాదం చిలికిచిలికి గాలివానగా మారి మతం రంగు పులుముకున్నది. తొలుత ఉడుపి, కోలార్ జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆందళనలు..ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి. కర్ణాటక ఉత్తర ప్రాంతానికీ పాకాయి. రెండు వర్గాలుగా విడిపోయి విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. దీంతో ప్రభుత్వం అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నట్టు ఫిబ్రవరి 8న ప్రకటించింది.