G20 Summit: ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైన జీ-20 సదస్సు

G20 Summit: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా 20 దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరు

Update: 2023-09-09 06:37 GMT

G20 Summit: ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైన జీ-20 సదస్సు

G20 Summit: ఢిల్లీలో అట్టహాసంగా జీ-20 సదస్సు ప్రారంభమయ్యింది. 20 దేశాల నాయకులకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ఆయా దేశాల నేతలకు మోడీ కరచాలనం, ఆలింగనంతో ఘనంగా స్వాగతం పలికారు. భారత మండపంలోని స్వాగత వేదిక వద్ద ఒడిషాకు చెందిన కోణార్క్‌ చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోణార్క్‌ చక్రం భ్రమణ చలనం, సమయంతో పాటు నిరంతర మార్పులను దేశాధినేతలు ఆసక్తిగా తిలకించారు.

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, జపాన్‌ ప్రధాని కిషిదా, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, దక్షిణాప్రికా అధ్యక్షుడు రామపోసా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా 20 దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. జీ-20 సదస్సును ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. సదస్సు ప్రారంభానికి ముందు మొరాకో భూకంపం విచారం వ్యక్తం చేశారు ప్రధాని. విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. భారత్ మొరాకొ దేశానికి అండగా ఉంటుందని తెలిపారు.

తన ప్రసంగం సందర్భంగా జీ 20 దేశాలు ఐక్యంగా పనిచేయాలని కోరారు ప్రధాని మోడీ. పాత సవాళ్లు మన నుంచి కొత్త సమాధానాలు కోరుతున్నాయన్న ప్రధాని.. అందుకోసం హ్యూమన్‌ సెంట్రిక్‌ అప్రోచ్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొవిడ్‌ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడిందన్న ప్రధాని... యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచిందన్నారు. ఈ అపనమ్మకాన్ని జయించేందుకు.. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ మంత్రం మార్గదర్శిగా ఉంటుందన్నారు.



Tags:    

Similar News