ఉదయ్ పూర్ వేదికగా సంగీత సాంస్కృతిక నృత్యప్రదర్శన
* ఆధ్యాత్మిక భావనతో సాగిన సాంస్కృతిక సంబరం
Udaipur: ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన భారతీయ సాంస్కృతిక నృత్యరీతులు జీ20 ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంగీతానికి భారతీయులు ఎంతటి ప్రాముఖ్యతనిస్తారనే విషయాన్ని విభిన్నరీతుల్లో ప్రదర్శించారు. సంగీతంతో ఆధ్యాత్మిక భావన కలిగించే నృత్యప్రదర్శన, సంకీర్తనల ఆలాపన విదేశీ ప్రతినిధులను రంజింపజేశాయి. రాజస్థానీ సంగీతం, భరతనాట్యం, కేరళా నృత్యరీతులు, పంజాబీ, గుజరాతీ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కళాకారులచే ఆయా రాష్ట్రాల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్న సంగీతం, సాంస్కృతి నృత్యప్రదర్శనలు సమ్మోహింపజేశాయి.