రైతు సంఘాలతో ముగిసిన కేంద్రం చర్చలు

Update: 2020-12-30 14:41 GMT

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనపై ఢిల్లీ విజ్ఢాన్ భవన్ లో కేంద్రం రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యింది. దాదాపు ఐదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు అంశంలో కొలిక్కి రాలేదు. రైతులు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టభనకు తెరపడలేదు. జనవరి 4న మరోసారి సమావేశం కావాలని కేంద్రం నిర్ణయించింది. మద్దతు ధర విషయమై కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆలోచన చేస్తుంది.

రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయుకాలుష్య ఆర్డినెన్స్ లో శిక్ష, జరిమానాల నుంచి రైతులను మినహాయిస్తూ సవరణలు చేయాలన్న అంశాన్ని కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. అదే విధంగా విద్యుత్ చట్టసవరణ ముసాయిదా బిల్లులో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం యోచిస్తుంది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ నేతృత్వంలో చర్చలు జరిగాయి. 40 రైతు సంఘాల నాయకులు చర్చల్లో పాల్గొన్నారు.

Tags:    

Similar News