Delhi: దేశరాజధాని ఢిల్లీని టెన్షన్ పెడుతున్న ఎయిర్ పొల్యూషన్
Delhi: దీపావళికి ముందే పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
Delhi: దేశరాజధాని ఢిల్లీని మళ్లీ కాలుష్యం టెన్షన్ పెడుతోంది. దీపావళికి ముందే వాయు నాణ్యత క్షీణించడం ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. పీఎం 2.5, పీఎం 10 కేటగిరీల్లో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ 252, 131గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. నవంబర్ నిన్న, ఇవాళ ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఎయిర్ పొల్యూషన్ అధికంగా ఉన్నట్లు ఐఎండీ స్పష్టం చేసింది. ప్రతి ఏటా దీపావళి తర్వాత కనిపించే పరిస్థితులు ఈసారి పండుగకు ముందే కనిపించడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు.