ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్యాలయానికి టీఎస్ అధికారుల తాళాలు

AP Pollution Control Board: బేగం పేటలోని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్యాలయానికి తెలంగాణ అధికారుల తాళాలు

Update: 2021-07-07 07:09 GMT

AP Pollution Control Board 

AP Pollution Control Board: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం రగులుతుండగానే.. మరో గొడవ వచ్చి పడింది. ఇప్పటికే ఏపీ కార్యాలయాలన్నీ ఎప్పుడో అమరావతికి వెళ్లిపోయాయి. కాని కాలుష్య నియంత్రణ మండలి ఆఫీసు మాత్రం ఇంకా ఇక్కడే హైదరాబాద్ లో ఉండిపోయింది. ఫంక్షనింగ్ ఏపీలోనే నడుస్తోంది. ఇక్కడ ఆఫీసు ఖాళీగానే ఉంటోంది. అధికారులు పెద్దగా రాకపోయినా కొందరు ఉద్యోగులు వచ్చి వెళుతున్నారు. ఇప్పుడు దానికి కూడా తాళం పడిపోయింది. అది కూడా తెలంగాణ ఉద్యోగులు వేశారు. దీంతో కొత్త పేచీ మొదలైంది.

రాష్ట్ర విభజన పూర్తై ఏడేళ్లు గడుస్తున్న రెండు రాష్ట్రాల మధ్య ఇంకా సమన్వయం కుదరడంలేదు. హైదరాబాద్‌లోని బేగంపేటలో తెలుగు రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు ఉమ్మడిగా ఉపయోగిస్తున్న కార్యాలయానికి తెలంగాణ పీసీబీ తాళం వేసింది. ఇక్కడి ఆఫీసుకి ఏపీ అధికారులు ఎవరూ రాకపోవడం, తాళాలు వేసి ఉండటంతో తెలంగాణ పీసీబీ దాన్ని స్వాధీనం చేసుకుంది.

అయితే, రాష్ట్ర విభజన అనంతరం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విడిపోయినా, రెండు కార్యాలయాలు ఒకే భవనంలో కొనసాగుతూ వచ్చాయి. ఒకటి, రెండు అంతస్తులను తెలంగాణ వినియోగిస్తుండగా, మూడు, నాలుగు అంతస్తులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది అధికారలు వాడుకుంటున్నారు. అయితే, అమరావతి రాజధాని ఏర్పాటుతో ఇక్కడున్న విభాగాలన్నీ ఏపీకి వెళ్లిపోవడంతో తాళం వేసే ఉంటోంది. కింది స్థాయి ఉద్యోగులు మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. ఆ రాష్ట్ర పీసీబీ ఛైర్మన్‌కు ఈ భవనంలో కార్యాలయం ఉంది.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ అధికారులు కొద్దిరోజుల క్రితం మరో తాళం వేసి, సీలు వేశారు. దీనిపై ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ''ఇచ్చిన చోటును ఏపీ అధికారులు.. ఆ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌.. దానిని పీసీబీ కోసమే వాడుకోవాలి. లేదంటే మాకు అప్పగించాలి. ఇందుకు భిన్నంగా వ్యవహరించడంతో తాళం వేశాం'' అని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఒకరు తెలిపారు.

Tags:    

Similar News