Chandrababu: ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు..సాయంత్రం అమిత్ షాతో చంద్రబాబు భేటీ
Chandrababu: ఏపీలో రాజకీయ పరిస్థితులు, పొత్తులపై చర్చించే ఛాన్స్
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీలో పొత్తుల చుట్టే రాజకీయాలు తిరుగుతున్న వేళ అమిత్ షా, చంద్రబాబు భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీలో రాజకీయ పరిస్థితులు, పొత్తులపై చంద్రబాబు, అమిత్ షా మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు కొనసాగుతోంది. అయితే ఈ కూటమిలో టీడీపీని సైతం కలుపుకునేందుకు పవన్ గత కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రయత్నించారు. ఉమ్మడిగా వెళితేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదన్న భావనలో పవన్ ఉన్నారు. అయితే రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం టీడీపీని కూటమిలో చేర్చుకునేది లేదని తేల్చిచెప్పారు. జనసేనతో పొత్తు ఓకే కాని... టీడీపీతో కలిసేది లేదని రాష్ట్ర నాయకత్వం గంటా పధంగా చెబుతున్న తరుణంలో అమిత్ షా, బాబు భేటీ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఏపీలో పొత్తులపై చర్చ జరుగుతున్న వేళ అమిత్ షా, బాబు భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్టీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత తొలిసారి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కలయిక.. పొత్తువరకు వెళుతుందా.? లేక చర్చల వరకు పరిమితమవుతుందన్న అన్న చర్చ జరుగుతోంది.