T cells protecting From Coronavirus: కరోనా పాజిటివ్ నిర్ధారణ కేసుల్లో 70-80 శాతం వరకు లక్షణాలు లేని కేసులేనని ముందు నుంచి వైద్యులు చెప్తున్నారు. ఇలాంటి కేసుల్లో కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. చాలా వరకు లక్షణాలు లేని కేసుల్లో T సెల్స్ కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. దానికి తోడు మనలోని జీన్స్ చిన్నప్పుడు వేసుకున్న వ్యాక్సిన్స్ తో పాటు ముఖానికి మాస్కులు వాడడం వల్ల కొన్ని చోట్ల కరోనా కంట్రోల్ ఐపోయిందని ఓ అధ్యాయనంలో తేలింది.
కరోనా వైరస్ ను అడ్డుకోవాలంటే దానికి తగ్గట్టు యాంటీ బాడీలు శరీరంలో ఉండాలి. అంటే ఇమ్యూనిటీ గట్టిగా ఉండాలి. యాంటీ బాడీల కన్నా ఇమ్యూనిటీకి వెన్ను అయిన 'టీ సెల్స్'అసింప్టమా టిక్ కేసుల్లో ఎక్కువగా పనిచేస్తున్నాయని అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ స్వీడన్లోని కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ల స్టడీల్లో తేలింది. కరోనా కొత్తదే అయినా ఆ మొండి మహమ్మారిని టీ సెల్స్ గుర్తుపడుతున్నాయి. లక్షణాల్లేని వాళ్ళతో అవే ప్రొటెక్టర్స్ గా మారుతున్నాయి. దానికి కారణం చిన్నప్పుడు వేసుకున్న వ్యాక్సిన్లే నని సైంటిస్టులు చెబుతున్నారు.
మన శరీరానికి ఈ టీ సేల్స్ ని ఆర్మీ అని చెప్పుకోవచ్చు. ఇమ్యూనిటీకి తెల్ల రక్త కణాల్లోని టీ సెల్స్, బీ సెల్స్ మూలం. టీ సెల్స్ బోన్ మ్యారో ద్వారా, థైమాస్ ద్వారా శరీరంలో నిలువ ఉంటుంది. ఎపుడైనా మన శరీరంలోకి వైరస్ గానీ బ్యాక్టీరియా గానీ ప్రవేశించినట్లైతే వాటిని గుర్తించి నాశనం చేస్తుంది. యాంటీ బాడీలు మన రక్తంలో 3-4 నెలలు మాత్రమే ఉంటే టీ సెల్స్ జీవితాంతం మన శరీరంలోనే నిలువ ఉంటాయి. బీ సెల్స్ కూడా మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇవి యాంటీ బాడీలను అభివృద్ధి చేసి వైరస్ నాశనం చేస్తుంది.
వైరస్ మన బాడీలోకి ఎంట్రి కాగానే యాంటిబాడిస్ అభివృద్ది చెందుతాయి. దాని ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు. రోగ నిరోదకశక్తి పెరగాలంటే మంచి ఆహరం తీసుకోవాలి. విటమిన్ డీ కోసం ఉదయం సూర్యరశ్మిలో కూర్చోవాలి, ఆకు కూరలు తీసుకోవడంతో పాటు, ప్రతిరోజు వ్యాయమం చేయాలి. మంచి నిద్ర పోవడం వల్ల అధికంగా టీసెల్స్ పెరిగి కరోన నుండి రక్షణ పొందవచ్చు. కరోన ముప్పు నుండి బయటపడాలంటే ఇమ్యునిటి సిస్టంను మరింత అభివృద్ది చేసుకోవాల్సిన అవసరముంది. దీని ద్వారా శరీరంలోకి ఎలాంటి వైరస్ వచ్చిన ఆంటిబాడీల ద్వారా రక్షణ పొందవచ్చు.