ఎన్నికల సంఘం సంస్కరణ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

* 24 గంటల లోపే గోయల్ నిమాయక ఫైల్ క్లియర్ అయిందన్న ధర్మాసనం

Update: 2022-11-24 07:28 GMT

ఎన్నికల సంఘం సంస్కరణ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు 

Supreme Court: భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టులో మూడోరోజూ విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి తీర్పును సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. 24 గంటల్లోనే ఫైల్ క్లియర్ కావడం, ఒక్క రోజులోనే అంతా పూర్తి చేయడంపై సుప్రీం ధర్మాసనం సందేహాలు వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టేలా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. 

Tags:    

Similar News