National Task Force: డాక్టర్స్ సేఫ్టీపై కొత్తగా నేషనల్ టాస్క్‌ఫోర్స్.. వీళ్ల పనేంటంటే..

కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఇకపై వైద్యులపై దాడులు జరగకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-20 07:46 GMT

Kolkata Doctor Rape and Murder Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. దేశంలో వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. అందులో భాగంగానే కొత్తగా నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఆఫ్ డాక్టర్స్ పేరిట ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ బృందాన్ని మూడు వారాల్లోగా మధ్యంతర నివేదిక అందించాలని.. అలాగే రెండు నెలల్లో పూర్తి నివేదిక అందించాలని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ప్రస్తుతం ఉన్న చట్టాలు వైద్యులపై దాడులను నిలువరించలేకపోతున్నాయని.. అందుకే కొత్తగా నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన ఈ నేషనల్ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఎవరెవరిని నియమించారంటే..

సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్ సరిన్,

డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి,

డాక్టర్ ఎం శ్రీనివాస్,

డాక్టర్ ప్రతిమా మూర్తి,

డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి,

డాక్టర్ సౌమిత్ర రావత్,

ప్రొఫెసర్ అనితా సక్సేనా, ఎయిమ్స్ ఢిల్లీ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం హెడ్,

ప్రొఫెసర్ పల్లవి సప్రే, డీన్ గ్రాంట్ మెడికల్ కాలేజ్ ముంబై,

డాక్టర్ పద్మ శ్రీవాస్తవ, ఎయిమ్స్ న్యూరాలజీ విభాగం.

వీళ్లే కాకుండా ఈ నేషనల్ టాస్క్‌ఫోర్స్ బృందం ఎక్స్-అఫిషియో సభ్యులలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, నేషనల్ మెడికల్ కమిషన్ చైర్‌పర్సన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ అధ్యక్షులు కూడా ఉంటారు. వీళ్లంతా దేశంలోని డాక్టర్ల రక్షణే ధ్యేయంగా ఒక బృందంగా కలిసి పని చేయనున్నారు.

Tags:    

Similar News