Super Blood Moon: నేడు ఆకాశంలో మరో అద్భుతం
Super Blood Moon: ఇవాళ ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది.
Super Blood Moon: ఇవాళ ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా చంద్రుడు ఇవాళ వివిధ రంగుల్లో కనువిందు చేయనున్నాడు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే కక్ష్యలోకి రానుండగా చంద్రుడు, సూర్యుడికి భూమి అడ్డుగా రానుంది. ఈ సమయంలో చంద్రుడిపై వివిధ రకాల కాంతి కిరణాలు పడటం ద్వారా ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో చంద్రుడు కనిపించనున్నాడు. గ్రహణం సమయంలో సాధారణ రోజుల కంటే పెద్దదిగా కనిపించనుంది జాబిల్లి. అయితే సూపర్ మూన్ భారత్‌లో పాక్షికంగానే కనిపిస్తుందంటున్నారు ఖగోళ నిపుణులు.