ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్న సుఖ్విందర్ సింగ్

* ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న సుఖ్వీందర్‌కు ఠాకూర్ అభినందన

Update: 2022-12-11 03:00 GMT

ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్న సుఖ్విందర్ సింగ్

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సుఖ్విందర్ సింగ్ సుక్కూ ఎంపికైన తర్వాత ఆయన స్వయంగా మాజీ ముఖ‌్యమంత్రి జైరాం ఠాకూర్‌ నివాసం చేరుకున్నారు. సుక్కూ వస్తారని సమాచారం అందుకున్న ఠాకూర్ ఇంటి గుమ్మంవద్దకు చేరుకుని స్వాగతించారు. ఇరువురూ ఆలింగనం చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు, కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షనేతగా ఎన్నికకావడం పట్ల ప్రత్యేకంగా అ‎భినందించారు. ఇంటికొచ్చిన కొత్త ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ పరివారానికి తేనీటి విందునిచ్చారు. సుక్కూ పదవీ ప్రమాణానికి ముందుగా ప్రతిపక్షనేత ఇంటికెళ్లి ఆత్మీయంగా పలుకరించి అభినందనలు తీసుకోడాన్ని చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో వైరంతో సంబంధంలేకుండా ఇలాంటి సన్నివేశాలు ప్రజల్లో సదాభిప్రాయం ఏర్పడుతోందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ప్రజాహిత పాలన అందించడమే లక్ష్యమని హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కూ అన్నారు. రాజకీయ పార్టీలు వేరైనా రాజకీయాలు, రాజకీయ నాయకుల అభిప్రాయాలు వేరైనప్పటికీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ప్రజలకు విశ్వాసపాత్రులు కావాలన్నదే లక్ష్యమన్నారు. సిమ్లాలో మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఇంటికొచ్చి ఆశీర్వచనాలు తీసుకున్న ఆనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. వ్యక్తులుగా వేర్వే అభిప్రాయాలు ఉండొచ్చని, రాజకీయ పార్టీలు వేరైనప్పటికీ ఇద్దరి అభిప్రాయాలు, లక్ష్యం ఒక్కటేనన్నారు. హిమాచల్ ప్రదేశ్‌ను అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఠాకూర్ అనుభవంతో ఇచ్చే సూచనలు, సలహాలు హిమాచల్ ప్రదేశ్ ప్రగతికి దోహదమవుతాయనే అభిప్రాయం సుఖ్విందర్ సింగ్ వ్యక్తంచేశారు.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నాయకులు సు‌‌ఖ్విందర్ సింగ్‌ సుక్కూను శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. సుక్కూ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆమోదించడంతో ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుఖ్వీందర్ సుక్కూను ముఖ్యమంత్రి పదవి వరించడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు అభినందలతో ముంచెత్తారు. పువ్వుచల్లుతూ.. సుఖ్వీందర్ సింగ్‌ను భుజాలపైకెత్తుకుని కాంగ్రెస్ కార్యాలయం ప్రదర్శనగా చేరుకున్నారు.

Tags:    

Similar News