మామిడిపండ్లు దొంగిలించాడని దేశ బహిష్కరణ విధించిన కోర్టు

ఓ భారతీయుడికి యూఏఈ ప్రభుత్వం కఠినమైన శిక్ష విధించింది. ఏకంగా అతడికి 5వేల దిర్హాన్ లతో పాటు దేశం నుంచీ బహిష్కరించింది. ఇంతకి ఆ భారతీయుడు చేసిన నేరం ఏంటీ అనుకుంటున్నారా? అతను 2ఏళ్ల క్రితం రెండు మామిడిపండ్లు దొంగిలించాడు.

Update: 2019-09-24 12:14 GMT

ఓ భారతీయుడికి యూఏఈ ప్రభుత్వం కఠినమైన శిక్ష విధించింది. ఏకంగా అతడికి 5వేల దిర్హాన్ లతో పాటు దేశం నుంచీ బహిష్కరించింది. ఇంతకి ఆ భారతీయుడు చేసిన నేరం ఏంటీ అనుకుంటున్నారా? అతను 2ఏళ్ల క్రితం రెండు మామిడిపండ్లు దొంగిలించాడు.

భారత్ కు చెందిన వ్యక్తి దుబాయ్ ఎయిర్ పోర్టులో పనిచేసేవాడు. ప్రయాణికుల లగేజీని కంటెయినర్ నుంచి కన్వేయర్ బెల్టుపైకి ఎక్కించడం, దించడమే అతను చేసే పని. అయితే 2017 ఆగస్టు 11న ఎయిర్ పోర్టు విధులు నిర్వహిస్తున్న అతడు ఓ ప్రయాణికుడికి చెందిన పండ్ల బాక్సు నుంచి రెండు మామిడిపండ్లను దొంగిలించాడు. ఈ విషయం కాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో అతడు దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. ఆకలిగా ఉన్నానని అందుకే పండ్లు దొంగిలించానని చెప్పాడు. కేసు విచారించిన ఫస్ట్ ఇన్‎స్టాన్స్ కోర్టు దేశ బహిష్కరణ విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. 

Tags:    

Similar News