SSC GD కానిస్టేబుల్ 2021 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
SSC GD Constable 2021: SSC GD కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడించారు.
SSC GD Constable 2021: SSC GD కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. రిజల్ట్ తెలుసుకోవడానికి రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ అవసరం. SSC GD కానిస్టేబుల్ పరీక్ష నవంబర్ 16, డిసెంబర్ 15, 2021 మధ్య జరిగింది. దీని తర్వాత, తాత్కాలిక సమాధానాల కీ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
తర్వాత అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా CAPF, NIA, SSA, రైఫిల్‌మ్యాన్ (GD)లో మొత్తం 25,271 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో పురుషులు 22,424, స్త్రీలు 2,847.
ఇలా తెలుసుకోండి..
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. ఆ తర్వాత రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. వ్యక్తిగత వివరాలను నమోదు చేసి ఓకె బటన్ నొక్కండి.
4. ఫలితం మీ ముందు ఉంటుంది.
5. రిజల్ట్ కాపీని డౌన్‌లోడ్ చేసి మీ వద్ద ఉంచుకోండి.
పదో తరగతి అర్హతతో నిర్వహించే ఈ పరీక్షకు 18 నుంచి 23 ఏళ్ల వయసు వారు అప్లయ్ చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ పరీక్షలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఇంటలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవర్‌నెస్, ఎలిమెంటరీ మాథమెటిక్స్, ఇంగ్లీష్ లేదా హిందీపై ప్రశ్నలు ఉంటాయి. ఈ పోస్టులకు అభ్యర్థులను.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.