PM Modi: మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక అతిథులు..ఎవరంటే?

వివిధ దేశాధినేతలకు ఆహ్వానం పంపిన అధికారులు

Update: 2024-06-07 14:27 GMT

PM Modi: మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక అతిథులు..ఎవరంటే?

జూన్‌ 9న మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంత మందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ జాబితాలో ట్రాన్స్‌జెండర్లు, కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి పని చేసిన శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ రైళ్లు వంటి కీలక ప్రాజుక్టుల్లో పని చేసిన వారికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే వివిధ దేశాధినేతలు తమకు ఆహ్వానాలు అందినట్లుగా ప్రకటించారు.

Tags:    

Similar News