August 15న భారత్‌తో పాటు మరో 5 దేశాలు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాయి... అవేంటో తెలుసా?

Update: 2024-10-05 15:06 GMT

Nations Celebrating Independence Day on August 15th: భారతదేశానికి 1947 ఆగస్ట్ 15న స్వతంత్రం వచ్చిందన్న సంగతి మనందరికీ తెలుసు. ఇటీవలే మనం 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం. అదే రోజున ప్రపంచంలో మరికొన్ని దేశాలు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాయన్న సంగతి మీకు తెలుసా?

అవును.. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే దేశాలు మరో అయిదు ఉన్నాయి. ఆ దేశాలు:

1. ది రిపబ్లిక్ ఆఫ్ కాంగో

2. దక్షిణ కొరియా

3. ఉత్తర కొరియా

4. లీచ్‌టెన్‌స్టయిన్

5. బహ్రెయిన్

ఈ దేశాలు ఎప్పుడు ఎలా స్వతంత్ర దేశాలుగా మారాయి? వాటి పోరాట చరిత్ర ఏమిటన్నది సంక్షిప్తంగా తెలుసుకుందాం.

1. రిపబ్లిక్ ఆఫ్ కాంగో

ఆఫ్రికా పశ్చిమ తీర ప్రాంతంలో ఉండే ఈ దేశం చాలా కాలం పాటు ఫ్రెంచి పాలనలో ఉండేది. 1960లో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, డెమాక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే మరో దేశం ఉంది. ఈ రెండూ ఇరుగు పొరుగు దేశాలే.

2 & 3. దక్షిణ కొరియా – ఉత్తర కొరియా

దక్షిణ, ఉత్తర కొరియా అంతా కూడా ఒకప్పుడు జపాన్ పాలనలో ఉండేది. 1945లో ఆగస్ట్ 15న ఈ భూభాగానికి స్వతంత్రం వచ్చింది. అప్పుడే ఇవి రెండు దేశాలుగా ఏర్పడ్డాయి. దక్షిణ – ఉత్తర కొరియా దేశాలను డెమాక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని అంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తరువాత ఈ దేశాలకు స్వాతంత్ర్యం వచ్చింది. వీటితో పాటు మరికొన్ని దేశాలు ఆగస్ట్ 15ను జపాన్ మీద విజయం సాధించిన రోజుగా సెలెబ్రేట్ చేసుకుంటాయి.

4. లీచ్‌టెన్‌స్టయిన్

యూరప్‌లోని ఈ అతిచిన్న దేశం.. అత్యంత సంపన్నదేశం కూడా. నిజానికి, ఈ దేశం ఎన్నడూ పరదేశీ పాలనలో లేదు. కాకపోతే, ఆగస్ట్ 15ను ఈ దేశం నేషనల్ డేగా జరుపుకుంటోంది. 1940 నుంచి లీచ్‌టెన్‌స్టయిన్‌ రాజధాని వాడుజ్‌లో జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి.

5. బహ్రెయిన్

ఐక్యరాజ్యసమితి బహ్రెయిన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపినప్పుడు, అక్కడి ప్రజల్లో అధిక శాతం మంది తమకు బ్రిటిష్, ఇరాన్ పాలకుల నుంచి స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు. దాంతో, 1971 ఆగస్ట్ 15న పర్షియన్ గల్ఫ్‌లోని ఈ ద్వీపాల దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, బహ్రెయిన్ నేషనల్ డేను మాత్రం డిసెంబర్ 16న జరుపుకుంటుంది. అది, ఆ దేశం తొలి ఎమీర్ అంటే పాలకుడు సింహాసనం అధిష్ఠించిన రోజు.

Tags:    

Similar News