Sonia Gandhi: తెలంగాణలో కర్ణాటక ఫార్ములా.. ఐదు గ్యారెంటీ పథకాలు ప్రకటించనున్న సోనియా
Sonia Gandhi: ఐదు గ్యారంటీ పథకాలు ప్రకటించనున్న సోనియా
Sonia Gandhi: కర్ణాటక ఫార్ములానే తెలంగాణలో గెలిపిస్తుందని కాంగ్రెస్ ధీమాగా ఉందా..? అక్కడ ప్రకటించినట్టే మేనిఫెస్టోలో ఫ్రీ గ్యారంటీ స్కీములను ప్రకటించి... తెలంగాణ ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందా..? వీటిని సెప్టెంబర్ 17న సోనియా గాంధీ తెలంగాణలో ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.... ఇంతకీ సోనియా తెలంగాణ ప్రజలకు ఇవ్వనున్న వాగ్దానాలు ఎంటి...?
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తూ ముందుకు వెళుతోంది. ఇప్పటికే ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు అన్నివర్గాల ప్రజలకు డిక్లరేషన్ ప్రకటిస్తుంది.. కర్ణాటకలో ఐదు గ్యారెంటీ స్కీములతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో కూడా గ్యారంటీ కార్డును ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. దీనిపై టీ కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తూ... తామా అధికారంలోకి వస్తే మా మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను నెరవేరుస్తామంటూ ప్రజలకు చెబుతున్నారు..
కర్నాటక ఎన్నికల్లో పలు అంశాలతోపాటు ఫ్రీ గ్యారంటీ స్కీమ్ కాంగ్రెస్ పార్టీకి ఒక ట్రంప్ కార్డులా ఉపయోగపడింది. అధికారంలోకొస్తే ఏమేం చేస్తామో ముందుగానే మేనిఫెస్టోలో ప్రకటించిన కర్ణాటక కాంగ్రెస్... వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, గృహలక్ష్మి పథకం కింద ప్రతి ఇంట్లో ఒక మహిళకు రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యంతో పాటు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్.... వాటిలో నాలుగింటిని అమలు చేస్తోంది. వచ్చే నెల ఇంకో పథకం మొదలవుతుందని కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ స్కీం ప్రవేశ పెట్టడం కాంగ్రెస్ పార్టీ వైపు కర్ణాటక సామాన్య జనం నిలబడేలా చేయడంతో... తెలంగాణలో కూడా ఇలాంటి ఐదు గ్యారెంటీ స్కీంల కోసం వ్యూహరచన చేస్తోంది.
గ్యారంటీ కార్డులో ఏ హామీలు ఇస్తే జనం కాంగ్రెస్ వైపు మరలుతారనే దానిపై సునీల్ టీం ఎక్స్‌పర్ట్ కమిటీతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో పలు సార్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఏ హామీ అయినా ప్రజలను ఆకర్షించేలా ఉండాలనేది కాంగ్రెస్ ప్లాన్.... ఎన్నికల నాటికి ఆకర్షవంతమైన పథకాలతో గ్యారంటీ కార్డును సిద్ధం చేసే పనిలో పడింది టీ కాంగ్రెస్.... ఇక తెలంగాణలో సోనియా గాంధీకి ఒక ఇమేజ్ ఉంది. తెలంగాణ తల్లిగా ఆమెకి ఒక క్రేజ్ ఉంది. సోనియా ఈ గ్యారంటీ కార్డును తెలంగాణ గడ్డపై ప్రకటిస్తే... కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ విపరీతంగా పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక ఇదే వేదికపై సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే లతో పాటు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సాక్షిగా 5 గ్యారంటీ పథకాలను ప్రకటించడం పార్టీ గ్రాఫ్ పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు..
ఇప్పటికే పలు డిక్లరేషన్లు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ రానున్న రోజుల్లో మరిన్ని డిక్లరేషన్లు ప్రకటించనుంది. వరంగల్‌లో రైతు డిక్లరేషన్, ఇటీవల హైదరబాదులో చేసిన యూత్ డిక్లరేషన్ కాంగ్రెస్‌కి చాలా ప్లస్ పాయింట్ అయింది. చేవెళ్ల కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. త్వరలోనే బీసీ డిక్లరేషన్, మహిళ డిక్లరేషన్ ప్రకటించి సెప్టెంబర్ 17న 5 గ్యారంటీ స్కీములను ప్రకటించేందుకు టీ కాంగ్రెస్ సిద్దమయింది. మేనిఫెస్టోలో 5 గ్యారంటీ స్కీమును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇల్లు కట్టుకునే వారికి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించనుంది.... ఫ్రీ గ్యారంటీ స్కీములో ఈ అంశాన్ని పెట్టనున్నట్లు సమాచారం.
కేసీఆర్ సర్కార్ రైతుబంధు, రైతు బీమా.. ఇస్తూ మిగతా రైతులకు అందే పథకాలన్నీ తీసేసిందనీ... కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించనుంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధర నెలనెలకు పెరుగుతోందని, దీంతో సామాన్యులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాము అధికారంలోకొస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెబుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రకటించనున్నట్లు సమాచారం. వీటితో పాటు కరెంటు సంబంధించి కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై కసరత్తు జరుగుతుందట.... ఇలా పలు అంశాలతో ఐదు గ్యారంటీ స్కీమును ప్రకటించి... ఆపన్నహస్తం పేరుతో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ల ప్రజలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది.