Sologamy Marriage: చెప్పినట్లే తనను తనే పెళ్లి చేసుకుంది!

Sologamy Marriage: పెళ్లంటే అమ్మాయి, అబ్బాయి ఉండాలి. కానీ ఆ యువతి వరుడు లేకుండానే పెళ్లి చేసుకుంది.

Update: 2022-06-09 15:15 GMT

Sologamy Marriage: చెప్పినట్లే తనను తనే పెళ్లి చేసుకుంది!

Sologamy Marriage: పెళ్లంటే అమ్మాయి, అబ్బాయి ఉండాలి. కానీ ఆ యువతి వరుడు లేకుండానే పెళ్లి చేసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ యువతి ముందు చెప్పినట్టుగా వరుడు లేకుండానే తనకు తానే పెళ్లి చేసుకుంది. ముహూర్తానికన్నా రెండు రోజుల ముందే తనకు తాను మనువాడింది. గుజరాత్ వడోదరాకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు సోలోగామీ పెళ్లి చేసుకున్న తొలి యువతిగా నిలిచింది. ఈ పెళ్లికి పూజారి లేడు సరికదా అప్పగింతలు కూడా లేవు. హల్దీ, మెహందీ వంటి సాంప్రదాయ పెళ్లి వేడుకల్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా జరుపుకుంది. ఈ తంతుకు సంబంధించిన మొత్తం ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. రెండు వారాల పాటు గోవాకు హనీమూన్ ట్రిప్ వెళ్లేందుకు బిందు పేరెంట్స్ అనుమ‌తి కూడా ఇచ్చారు.

Tags:    

Similar News