Maharashtra: షిర్డీ సాయిబాబా ఆలయంపై కరోనా ఎఫెక్ట్
Maharashtra: షిర్డీ సాయిబాబా ఆలయంపై కరోనా ప్రభావం పడింది.
Maharashtra: షిర్డీ సాయిబాబా ఆలయంపై కరోనా ప్రభావం పడింది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా మాహమ్మారితో కొద్దిసేపటి క్రితం ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ఇప్పటికే మహారాష్ర్టలో వారాంతపు లాక్‌డౌన్, రాత్రి వేళ కర్ప్యూ కొనసాగుతుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.