ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్ల కోసం సెర్చ్ ఆపరేషన్
Chhattisgarh: అడవిలో పెద్దఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు ఉన్నారన్న సమాచారంతో పోలీసులతో కలిసి సైనికులు సోదాలు నిర్వహించారు. బాదరాయనార్ అడవిలో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో అక్కడి నుండి ఇన్‌ఫార్మర్ల సమాచారం మేరకు మావోయిస్టులు పారిపోయినట్లు తెలుస్తోంది. సదరు ప్రాంతంలో పెద్దఎత్తున పేలుడు పదార్థాలు, ప్రెషర్ కుక్కర్, బ్యాటరీ, నక్సలైట్ బ్యానర్, కరపత్రాలు తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.