Scientists Identify Six Different Types of Coronavirus: కరోనా వైరస్ లక్షణాలు రోజుకో రకంగా.. తాజాగా..
Scientists Identify Six Different Types of Coronavirus: కరోనా వైరస్ లక్షణాలు రోజుకో రకంగా వెలుగులోకి వస్తున్నాయి. మొదట్లో దగ్గు, జలుబు , జ్వరం , శ్వాసకోశ సమస్యలు ఉంటాయని మాత్రమే అన్నారు.
Scientists Identify Six Different Types of Coronavirus: కరోనా వైరస్ లక్షణాలు రోజుకో రకంగా వెలుగులోకి వస్తున్నాయి. మొదట్లో దగ్గు, జలుబు , జ్వరం , శ్వాసకోశ సమస్యలు ఉంటాయని మాత్రమే అన్నారు. ఆ తరువాత రుచి వాసన కోల్పోవడం కండరాల నొప్పి డైయేరియా వంటివి వచ్చి చేరాయి. ఇప్పుడు యూకేలోని కొందరు శాస్త్రవేత్తలు కరోనా లక్షణాలు ఆరో రకాలుగా ఉన్నట్టు తెలిపారు. కొత్తగా ఆకలి లేకపోవడం, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తున్నాయని తేల్చారు. కింగ్ కాలేజ్ లండన్ అధ్యయనం ప్రకారం మొదటి రకంలో ఫ్లూ తరహా లక్షణాలు ఉంటాయి. వాసన కోల్పోవడం , కండరాల నొప్పులు , దగ్గు, గొంతులో మంట, ఛాతినొప్పి వంటివి వచ్చాయి. రెండో రకంలో జ్వరం తో కూడిన ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి వాసన కోల్పోవడం దగ్గు, గొంతు బొంగురు పోవడం, జ్వరం కనిపిస్తాయని తెలిపారు. ఇక మూడో రకంలో జీర్ణప్రక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని..
ఆకలి మందగించడం, డయేరియా వంటి లక్షణాల తోపాటు దగ్గు గొంతునొప్పి ఉండవు అని పరిశోధకులు అంటున్నారు. ఇక నాలుగో రకంలో కాస్త తీవ్రత కనిపిస్తుంది. జ్వరం దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి రుచి, వాసన కోల్పోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని కింగ్స్ కాలేజీ అధ్యయనం చెబుతోంది. ఇదో రకంలో తలనొప్పి, వాసన కోల్పోవడం, దగ్గు, జ్వరం , కండరాల నొప్పులు, ఆయాసం, ఆకలి మందగించడం, స్థిమితంగా వుండలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ఇక ఆరో రకంలో ఇవే లక్షణాలు అత్యంత తీవ్రంగా బాధిస్తాయి. మొదటి అయిదు రకాలలో ఉన్న అన్ని లక్షణాలతోపాటుగా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది.. ఇక ఆరో రకం లక్షణాలు ఉన్నవారిలో యాభై శాతం మందికి ఆసుపత్రిలో చికిత్స అవసరమని అంటున్నారు పరిశోధకులు.