సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా 'గే' లాయర్‌ !

Supreme Court: సుప్రీంకోర్టు కొలీజియం సంచలన నిర్ణయం తీసుకున్నది.

Update: 2021-11-16 07:44 GMT

సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ‘గే’ లాయర్‌ !

Supreme Court: సుప్రీంకోర్టు కొలీజియం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా గే వ్యక్తిని నియమిస్తూ సీజేఐ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ లాయర్ సౌరబ్ కిర్ పాల్ పేరు సిఫార్సు చేశారు. సౌరబ్ కిర్‌పాల్ మాజీ సీజేఐ బీఎన్ కిర్‌పాల్ కుమారుడు. 2017లో సౌరబ్ కిర్‌పాల్ పేరును ఢిల్లీ హైకోర్టు సిఫార్సు చేసింది. వీదేశీ రాయభార కార్యాలయంలో పని చేస్తున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. గేతో సహజీవనం చేస్తున్నారన్న కారణంతో సౌరబ్ కిర్‌పాల్ పేరును కేంద్రం పక్కన పెట్టింది. గే హక్కుల కోసం సుప్రీంలో పోరాడి విజయం సాధించారు సౌరబ్ కిర్‌పాల్. కొలీజియం సిఫార్సును ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశంలోనే తొలి గే జడ్జిగా సౌరభ్‌ వార్తలకెక్కనున్నారు.

Tags:    

Similar News