Amrit Bharat : అమృత్ భారత్ 2.0 ట్రైన్ ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Amrit Bharat train features: భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను అలాగే తన కోచ్‌లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. రైల్వేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తన కోచ్‌లను మరింత సౌకర్యవంతంగా మారుస్తున్నాయి. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను, తక్కువ ఖర్చుతో మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వందే భారత్ తరహాలోనే భారతీయ రైల్వేలు పేదలకు అమృత్ భారత్ రైళ్లను బహుమతిగా అందించాయి. ఈ రైళ్ల ద్వారా ప్రయాణీకులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలను అందిస్తున్నాయి.
అల్పాదాయ వర్గం ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమృత్ భారత్ 2.0 వెర్షన్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో అమృత్ భారత్ 2.0 కోసం అధునాతన కోచ్‌ల ఉత్పత్తి జరుగుతోంది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించి అమృత్ భారత్ రైళ్లను పరిశీలించారు. రాబోయే రెండేళ్లలో 50 అమృత్ భారత్ రైళ్లు పట్టాలెక్కుతాయని ఆయన అన్నారు. ఈ కోచ్‌లు సెమీ-హై స్పీడ్ కలిగిన వందే భారత్ రైళ్ల ప్రీమియం అనుభవంతో పోటీ పడతాయి.
అమృత్ భారత్ ట్రైన్ 2.0 ఫీచర్లు
అమృత్ భారత్ 2 కొత్త వెర్షన్‌లో ప్రయాణీకులకు అనేక సౌకర్యాలు అందిస్తున్నారు. ఇది ప్రీమియం, లగ్జరీ రైళ్లలో లభించే సౌకర్యాలకు సమానంగా ఉంటాయి. అమృత్ భారత్ 2.0 వెర్షన్‌లోని కొత్త ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం.
సౌకర్యవంతమైన సీటింగ్: సుదీర్ఘ ప్రయాణాన్ని సౌకర్యంగా చేయడానికి కంఫర్టబుల్ సీటింగ్ సౌకర్యం అందిస్తున్నారు. ఎర్గోనామిక్ సీటింగ్ డిజైన్ చేశారు.
మాడ్యులర్ టాయిలెట్: ప్రయాణీకుల కోసం మాడ్యులర్ టాయిలెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇది ఆధునిక సౌకర్యాలతో కూడిన టాయిలెట్ అని ఇండియన్ రైల్వేస్ తెలిపింది.
ఆధునిక ప్యాంట్రీ కార్: రైళ్లలో అందించే ఆహారం నాణ్యత గురించి తరచుగా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా రైళ్లలో అందించే ఆహారం మంచిది కాదనే పేరుంది. అమృత్ భారత్ రైలులో మెరుగైన ఆహార సౌకర్యాల కోసం ఒక ఆధునిక ప్యాంట్రీ కారును నిర్మించారు.
అధునాతన భద్రత: అమృత్ భారత్ 2 లో CCTV కెమెరాలు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ కూడా ఉన్నాయి.
LED లైటింగ్ : LED లైటింగ్ ఏర్పాట్లు చేశారు. దీనిలో ప్రయాణీకులు ప్రయాణ సమయంలో చదవాలనుకుంటే, వారు ఈ కాంతిలో సులభంగా చదువుకోవచ్చు.
మొబైల్ ఛార్జింగ్ స్టేషన్: ప్రయాణీకుల కోసం మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ సౌకర్యం కూడా కల్పించారు.
పెద్ద లగేజ్ రాక్: ప్రయాణీకులు లగేజీని ఉంచడానికి విశాలమైన స్థలం అందించారు. దీనిలో ప్రయాణీకులు తమ లగేజీని సులభంగా ఉంచుకోవచ్చు.
కోచ్ ఎంపికలు: ఈ రైళ్లలో ప్రయాణీకుల కోసం రిజర్వ్డ్ స్లీపర్ కోచ్‌లు, అన్‌రిజర్వ్డ్ జనరల్ కోచ్‌లు కూడా ఉంటాయి.
గాజు పైకప్పులు: ప్రయాణీకులు ప్రయాణాన్ని ఆస్వాదించడానికి వీలుగా గాజు పైకప్పులతో రూఫ్ డిజైన్ చేశారు. తద్వారా ప్రయాణీకులు ప్రయాణ సమయంలో ప్రకృతి అందాలను తిలకించవచ్చు.