Bank Holidays : జనవరి 13, 14 తేదీలలో బ్యాంకులు పని చేస్తాయా? జనవరిలో మొత్తం ఎన్ని హాలిడేస్?

Update: 2025-01-12 05:45 GMT

Bank Holidays January 2025: జనవరి 13, 14 తేదీలలో బ్యాంకులు పని చేస్తాయా.. జనవరిలో మొత్తం ఎన్ని హాలిడేస్ ?

Bank Holidays : జనవరి నెలలో ఇప్పటికే 11 రోజులు గడిచిపోయాయి. రాబోయే రోజుల్లో చాలా పండుగలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన పండుగలు లోహ్రి, మకర సంక్రాంతి. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ రెండు రోజులు బ్యాంకులు పని చేస్తాయా అనేది ప్రశ్న. అయితే, జనవరిలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ, రాష్ట్ర పండుగలు ఉన్నాయి. దీని కారణంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రెండవ, నాల్గవ శనివారాలు కూడా బ్యాంకులు మూసిసే ఉంటాయి. జనవరి 13, 14 తేదీలలో బ్యాంకు సెలవుల గురించి ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ఏమి చెబుతుందో చూద్దాం.

లోహ్రీ, మకర సంక్రాంతి నాడు బ్యాంకులకు హాలీడే

మకర సంక్రాంతి రోజు బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆ రోజు బ్యాంకులు పని చేయవు. జనవరి 13న లోహ్రీ సందర్భంగా దేశంలో బ్యాంకులు తెరిచి ఉంటాయి. జనవరి 14న మకర సంక్రాంతి నాడు కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మకర సంక్రాంతి / ఉత్తరాయణ పుణ్యకాలం / పొంగల్ / మాఘే సంక్రాంతి / మాఘ బిహు, హజ్రత్ అలీ పండుగ సందర్భంగా అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటానగర్, కాన్పూర్, లక్నో లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జనవరి 2025 లో బ్యాంకు సెలవుల జాబితా

జనవరి 1 – నూతన సంవత్సర దినోత్సవం/లోసోంగ్/నామ్సంగ్: ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్‌టాక్, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా , షిల్లాంగ్‌లలో బ్యాంకులు మూసేసి ఉంటాయి.

జనవరి 2 - లోసాంగ్/నామ్సంగ్/నూతన సంవత్సర వేడుకలు: ఐజ్వాల్, గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసేసి ఉంటాయి.

జనవరి 5 - ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసేసి ఉంటాయి.

జనవరి 6 - శ్రీ గురు గోవింద్ సింగ్ పుట్టినరోజు: చండీగఢ్‌లో బ్యాంకులు మూసేసి ఉంటాయి.

జనవరి 11 - మిషనరీ దినోత్సవం/ఇమోయిను ఇరాటప/రెండవ శనివారం: ఇంఫాల్, ఐజ్వాల్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసేసి ఉంటాయి.

జనవరి 12 - ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జనవరి 14- మకర సంక్రాంతి/ ఉత్తరాయణ పుణ్యకాలం/ పొంగల్/ మాఘే సంక్రాంతి/ మాఘ బిహు/ హజ్రత్ అలీ పుట్టినరోజు: అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటానగర్, కాన్పూర్, లక్నోలలో బ్యాంకులకు సెలవు దినం.

జనవరి 15 - తిరువళ్లువర్ దినోత్సవం: చెన్నైలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జనవరి 16 - ఉళవర్ తిరునాల్: చెన్నైలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జనవరి 19 - ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవు ఉంటుంది.

జనవరి 23 - నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు/వీర్ సురేంద్రసాయి జయంతి: అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జనవరి 25 - నాల్గవ శనివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినం.

జనవరి 26- ఆదివారం, గణతంత్ర దినోత్సవం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు పబ్లిక్ హాలిడే.

Tags:    

Similar News