TOP 6 NEWS @ 6PM: పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలతో చిక్కుల్లో పడిన పోసాని కృష్ణమురళి

Update: 2024-11-12 12:35 GMT

1) Rythu Bharosa: రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. రైతు భరోసా ఎప్పుడంటే..?

Rythu Bharosa: తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రుణమాఫీ చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్‌ ఇప్పుడు మరో హామీని నెరవేర్చనుందని సమాచారం. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోన్న సందర్బంలో రైతులకు శుభ వార్త చెప్పనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 10 వేల ఆర్థిక అందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ఈ మొత్తాన్ని రూ. 15వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోన్నా ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) జగన్ బెయిల్ రద్దు పిటిషన్: సుప్రీంలో కీలక పరిణామం

YS Jagan: ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జడ్జి నాట్ బి ఫోర్ మీ అనడంతో ఈ పిటిషన్ పై విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేశారు. 2024, డిసెంబర్ 2న జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ పిటిషన్ పై విచారణను గతంలో కూడా నాట్ బి ఫోర్ మీ అని సంజయ్ కుమార్ చెప్పారు.

ఇవాళ ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్ కూడా సభ్యులు. విచారణ ప్రారంభం కాగానే ఈ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిందని జగన్ తరపు న్యాయవాది బెంచీ దృష్టికి తెచ్చారు. దీంతో జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బి ఫోర్ మీ అన్నారు. పొరపాటున ఈ పిటిషన్ సంజయ్ కుమార్ ఉన్న బెంచీ వద్దకు వచ్చిందని సీజేఐ ఖన్నా చెప్పారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరపనుందని సీజేఐ ఖన్నా ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

3) పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు.. పోసానిపై జనసేన ఫిర్యాదు..

Posani Krishna Murali: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సినీ నటులు పోసాని కృష్ణ మురళిపై జనసేన నాయకులు జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ కు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో జనసేన నాయకులు గుర్తు చేశారు. ఈ విషయమై అప్పట్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. గతంలో పోసాని పై ఫిర్యాదుల అంశాన్ని జనసేన నాయకులు తెరమీదికి తెచ్చారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) Vikarabad: కలెక్టర్‌పై దాడి కేసులో 52 మంది అరెస్ట్.. 6 గ్రామాల్లో ఇంటర్నెట్‌ బంద్..

Vikarabad: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో ఫార్మా రగడ ఇంకా చల్లారలేదు. నిన్న దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూ సేకరణపై.. ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా కలెక్టర్‌తో పాటు కొడంగల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రత్యేక అధికారి సహా పలువురు అధికారులు వెళ్లారు. అయితే.. ప్రజాభిప్రేయ సేకరణను వ్యతిరేకిస్తూ.. కలెక్టర్‌, అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, అధికారుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. అది కాస్త దాడికి దారి తీసింది.

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, కడ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డిపై దాడి చేశారు రైతులు. అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి గ్రామాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులపై దాడి చేసినవారిలో ఇప్పటివరకు 52 మందిని గుర్తించి వారిని అరెస్ట్‌ చేశారు. పరిగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా లగచర్ల, రోటిబండ, పులిచర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

5) Kanguva Movie First Review: కంగువా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?

Kanguva Movie First Review in Telugu: సూర్య (Suriya) హీరోగా తెరకెక్కిన సినిమా కంగువా (Kanguva). అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పిరియాడిక్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ రూపొందించాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లతు దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలను పోషించడంతో కంగువాకు పాన్‌ ఇండియా రేంజ్‌ ఇమేజ్‌ వచ్చింది. కంగువా మూవీ ఫుల్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై కొనసాగుతోన్న ఉత్కంఠ.. పాకిస్థాన్‌లో జరిగేనా?

Champions Trophy 2025 Venue: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ట్రోఫీకి సంబంధించిన పూర్తి షెడ్యల్‌ను విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ ట్రోఫీకి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. ఈ ట్రోపీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో పూర్తి మ్యాచులను పాక్‌లోనే షెడ్యూల్ చేశారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత కీలకమైన భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడేందుకు సిద్ధంగా లేదు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News