Republic Day: అయోధ్య థీమ్‌తో ఉత్తరప్రదేశ్ శకటం.. ఆకట్టుకున్న బాలరాముడి రూపం
Republic Day: ఆకట్టుకున్న బాల రాముడి రూపం
Republic Day: దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో సైనికుల కవాతు, శకటాల ప్రదర్శనలు జరిగాయి. ఈసారి ఉత్తరప్రదేశ్ శకటం విశేషంగా ఆకట్టుకుంది. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరగగా... అదే థీమ్‌తో అయోధ్య విక్షిత్ భారత్-సమ్రాధ్ విరాసత్ ఆధారంగా శకటం రూపొందించారు. శకటం ముందు భాగంలో రాముడి చిన్ననాటి రూపం ఉంచారు. వెనకభాగంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి తాలుకూ విషయాలను వివరించేలా డిజైన్ చేశారు.