Rave Party: నోయిడాలో రేవ్ పార్టీ: 35 మంది విద్యార్థుల అరెస్ట్
రేవ్ పార్టీలో పాల్గొన్న 35 మంది కాలేజీ విద్యార్థులను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.
రేవ్ పార్టీలో పాల్గొన్న 35 మంది కాలేజీ విద్యార్థులను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నోయిడాలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ దాడి చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
నోయిడా సెక్టార్ 94లోని సూపర్ టెక్ సూపర్ నోవాలో పార్టీ జరుగుతున్న ఫ్లాట్ నుంచి ఓ మద్యం బాటిల్ ను తమ ఫ్లాట్స్ వైపు విసిరారని కొందరు ఫ్లాట్ యజమానులు ఆరోపించారు. పార్టీ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రేవ్ పార్టీ కోసం వాట్సాప్ ద్వారా ఇన్విటేషన్లు
రేవ్ పార్టీలో చేరేందుకు వాట్సాప్ ద్వారా ఆహ్వానాలు పంపారని ప్లాట్స్ ఓనర్లు ఆరోపిస్తున్నారు. ఈ పార్టీలో పాల్గొనేందుకు సింగిల్స్ కు రూ. 500, కపుల్స్ కు రూ. 800 వసూలు చేశారని ఆరోపించారు. పార్టీ జరిగిన ప్రాంతంలో మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పోలీసుల అదుపులో ఉన్నవారిలో మైనర్లు
రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో 16 నుంచి 20 ఏళ్ల వయస్సున్న విద్యార్థులున్నారని పోలీసులు తెలిపారు. పట్టుబడినవారిలో మద్యం సేవించి ఉన్నారని పోలీసులు చెప్పారు. ఈ ఫ్లాట్ నుంచి పలు మద్యం సీసాలు, హుక్కా తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గత ఏడాది నవంబర్ లో రేవ్ పార్టీ
నోయిడా పోలీసులు 2023 నవంబర్ లో రేవ్ పార్టీని భగ్నంచేశారు. పాము విషాన్ని విక్రయిస్తున్నారని ఓ ఎన్ జీ వో నుంచి ఫిర్యాదు అందుకున్న ఫిర్యాదు అందుకున్న నోయిడా పోలీసులు ఆ ప్రాంతంలో దాడి చేశారు. ఈ పార్టీలో కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి.
20 మిల్లిలీటర్ల పాము విషం, ఐదు నాగుపాములు, ఒక కొండచిలువ, రెండు తలల పాములు, ఎలుక పాములను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ లోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు పంపిన శాంపిల్స్ లో క్రైట్ విషం ఉందని తేలిందని పోలీసులు చెప్పారు.
యూపీలో 21 ఏళ్ల వయస్సు దాటితేనే మద్యం తాగేందుకు అనుమతి ఉంది. కానీ, నోయిడాలోని రేవ్ పార్టీలో మైనర్లున్నారని పోలీసులు గుర్తించారు. మైనర్లకు మద్యం ఎలా వచ్చిందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.