ప్రధాని పనికొస్తారా, లేదా అనేది ప్రశ్న కాదు: రాహుల్

Update: 2021-02-27 12:13 GMT

ప్రధాని పనికొస్తారా, లేదా అనేది ప్రశ్న కాదు: రాహుల్

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. తమిళనాడులో తూత్తుకుడి వీఓసీ కాలేజీలో జరిగిన ముఖాముఖీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ప్రధాని పనికొస్తారా, పనికిరారా అనేది ప్రశ్న కాదని, ఆయన ఎవరికి ఉపయోగపడతారు, ఎవరికి ఉపయోగపడరనేదే అసలైన ప్రశ్న అని పేర్కొన్నారు. ప్రధాని ఆ ఇద్దరు వ్యక్తులకే పూర్తిగా పనికొస్తారని అన్నారు. మోడీ తన మిత్రులైన ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారంటూ రాహుల్ విమర్శలు గుప్తించారు.

Tags:    

Similar News