Punjab: పంటపొలాల్లో వ్యర్థాల దహనంపై పంజాబ్ ప్రభుత్వం ఆగ్రహం
*558 మంది రైతులపై కేసులు నమోదు.. 45 కేసుల్లో ఒక్కో రైతుకు లక్షా 92వేల రూపాయల జరిమానా
Punjab: పంజాబ్‌లో పంటలను. పంటల వ్యర్థాల దహనంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పంట పొలాల్లో దహనం చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా..రైతులు మాత్రం వినడంలేదు. పొలాల్లోనే పంటలను దహనం చేస్తూ వాతావరణ కాలుష్యానికి కారకులవుతున్నారు. దీంతో ఆగ్రహించిన రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పంటలను దహనం చేసిన దాదాపు 558 మంది రైతులపై కేసులు నమోదు చేసింది. ఇందులో 45 కేసుల్లో ఒక్కో రైతుకు లక్షా 92వేల రూపాయల జరిమానా సైతం విధించింది. ఇకనైనా రైతులు ప్రభుత్వ సూచనలను తప్పకుండా పాటించాలని లుథియానాకు చెందిన వ్యవసాయశాఖ ఉన్నతాధికారి అమన్‌జీత్ సింగ్ విజ్జప్తి చేశారు.